Sun Transit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..!

Sun Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నెల 17న కన్యారాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. ఇది కొందరికి అనుకూలంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 08:40 AM IST
Sun Transit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..!

Surya Rashi Parivartan: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉన్న సూర్యుడు మరో 5 రోజుల్లో కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో సూర్యుడి సంచారాన్నే కన్యా సంక్రాంతి (Kanya Sankranthi) అంటారు. కన్యారాశిలో సూర్య సంచారం 6 రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. 

సూర్య సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus) - కన్యారాశిలో సూర్య సంచారం వల్ల ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రగతికి దారులు తెరుచుకుంటాయి. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. జాబ్ లో మీకు సహచరుల సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో సహనాన్ని కోల్పోకుండా.. సంయమనంతో వ్యవహారించండి. 
సింహం (Leo)- ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ సహకారంతో ఏ పెద్ద పని అయినా పూర్తి చేస్తారు. మనసు ఆనందంతో నిండి ఉంటుంది. 
కన్య (Virgo)- సూర్య సంచారం కారణంగా ఈ రాశివారి వ్యాపారం విస్తరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్య విషయంలో శ్రద్ధ వహించండి. అయితే ఎప్పుడూ అసహనంగా ఉండకండి. 
తులారాశి (Libra)- సూర్యుని ప్రభావం వల్ల వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సానుకూలంగా ఆలోచిస్తే, మీరు ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
కుంభం (Aquarius)- చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కష్టపడితే ఫలితం ఉంటుంది. ప్రగతి దారులు తెరుచుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
మీనం (Pisces)- విద్యార్థులు శ్రమిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ ఇబ్బంది ఉండదు.

Also Read: Karwa Chauth 2022: కర్వా చౌత్ ఎప్పుడు, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News