Budhaditya Raja Yoga: శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!
Most Effective Budhaditya Raja Yoga In Telugu: మీన రాశిలో బుధుడు, సూర్యుడి గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలిపారు. అలాగే ఈ సమయంలో బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా రెట్టింపు లాభాలు పొందుతారు.
Most Effective Budhaditya Raja Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 15న గ్రహాలకు రా రాజుగా పిలిచే సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే మీన రాశిలో బుధుడు సంచార క్రమంలో ఉన్నాడు. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా రాజయోగ ప్రభావం కూడా అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది. దీంతో జాతాకాల్లో ఈ యోగం శుభస్థానంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ బుధాదిత్య రాజయోగం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
బుధాదిత్య రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా కార్యాలయాల్లో మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభించే ఛాన్స్ కూడా ఉంది. అలాగే డబ్బుకు సంబంధించిన వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
కన్యా రాశి:
ఈ ప్రత్యేక యోగం కారణంగా కన్యా రాశి వారికి ఉద్యోగాల్లో మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా పురోగతి లభించే అవకాశాల ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా వీరు అనేక లాభాలు పొందుతారు. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా బాగుటుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు భాగస్వామి మద్ధతు లభించి అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో చేసే శ్రమ ఎంతగానో ఫలిస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యాలు చేసేందుకు కూడా ఇష్టపడతారు. అలాగే ఈ ప్రత్యేక యోగం కారణంగా కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. దీని కారణంగా వస్తువు సౌఖ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆస్తులు కూడా పెరగొచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి:
ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి కీర్తి, ప్రతిష్ఠలు పెరుగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. వీరికి పూర్వీకుల ఆస్తులు కూడా పెరుగుతాయి. అలాగే ఆఫీసులో మీ పనితీరు కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కొత్త ప్రాజెక్టులు కూడా లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి