Chaitra Navratri 2023 Pooja Tips Telugu: హిందూ క్యాలెండర్ ప్రకారం, హిందూ నూతన సంవత్సరం చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. అదే సమయంలో, నవరాత్రి మొదలైన అనేక పెద్ద పండుగలు కూడా ఈ మాసంలో జరుపుకుంటారు ప్రజలు. ఇక దసరాకు కాకుండా ఈ చైత్ర మాసంలో కూడా నవరాత్రులు జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షంలో ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఇక అప్పటి నుంచి దుర్గా దేవి తొమ్మిది రూపాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ మతంలో నవరాత్రులకు విశేష ప్రాధాన్యత ఉంది, ఈ తొమ్మిది రోజులు అమ్మవారు భువిపై భక్తుల మధ్య కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే భక్తుల భక్తికి సంతసించిన ఆమె భక్తుల ప్రతి కోరికను తీరుస్తుందని అంటారు. దుర్గామాతను పూజించడం, ఆమె కోసం ఉపవాసం చేయడం ద్వారా విశేష ఫలాలు లభిస్తాయని నమ్ముతారు.  ఇక ఈసారి చైత్ర నవరాత్రులు 22 మార్చి 2023 నుంచి ప్రారంభమవుతున్నాయి. నిజానికి హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏడాదికి నాలుగు సారాలు నవరాత్రులు జరుపుకుంటారు.


చైత్ర, శారదీయ నవరాత్రులతో పాటు, రెండు గుప్త నవరాత్రులు కూడా హిందువులు జరుపుకుంటారు. త్వరలో చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్న క్రమంలో ఈ చైత్ర నవరాత్రులలో, దుర్గా దేవి తొమ్మిది రూపాలను తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో, ఆచారాలతో పూజిస్తారు. ఈ నవరాత్రులలో ఉపవాసం ఉండి, దుర్గమ్మను పూర్తి భక్తితో పూజించడం వలన ఆమె తన భక్తులను సంతోషపరుస్తుందని, వారి కోరికలన్నీ తీరుస్తుందనిం నమ్ముతారు. ఆ తొమ్మిదిరోజుల్లో ఏమేం చేయాలి ఏమేం చేస్తే దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోండి. 


  • ఈ చైత్ర నవరాత్రులలో దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి, మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం పాటించాలి, అలా చేయడం సాధ్యం కాకపోతే, మొదటి, నాల్గవ మరియు ఎనిమిదవ రోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

  • ఇక దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి, నవరాత్రుల మొదటి రోజు పూజా స్థలంలో దుర్గమ్మ, లక్ష్మిదేవి, సరస్వతి విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలీ.

  • ఇక ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలంటే, చైత్ర నవ రాత్రులలో ఈ తొమ్మిది రోజులు అరిపోని విధంగా దీపాలు వెలిగించాలి. ఇక పూజ చేస్తున్న సమయంలో  'ఓం ఏ హ్రీ క్లీం చాముండాయై విచై' అనే మంత్రాన్ని జపించండి .

  • ఇక నవరాత్రి రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయడం చాలా ముఖ్యం, సంపూర్ణ పారాయణం చేయడం సాధ్యం కాకపోతే, దుర్గా సప్తశతి కవచ్, కీలక్ సహా అర్గల మూలాలను పఠించాలి.

  • ఇక నవరాత్రులలో ఆరాధన సమయంలో, ఎరుపు రంగు ఉన్ని ఆసనం మీద కూర్చోవాలి. మీకు ఎరుపు రంగు ఆసనం లేకపోతే దుప్పటి తీసుకుని దానిపై మరో ఎర్రటి వస్త్రం వేసి దానిపై కూర్చుని పూజించండి. 


Also Read: Surya Grahan 2023: సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ మూడు రాశుల వారు ఇక పట్టిందల్లా బంగారమే!


Also Read: Guru Mahadasha: గురు మహాదశతో 16 ఏళ్ల వరకూ తిరుగుండదా, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి