Chaitra Purnima on 7th April 2023: హిందూలంతా చైత్ర పూర్ణిమ మంచి రోజుగా భావిస్తారు. ఇది హిందూ నూతన సంవత్సరపు మొదటి పౌర్ణమి. కాబట్టి ఈ  పౌర్ణమికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజూ తల స్నానం చేసి దానం చేయడం వల్ల చాలా రకాల శుభ ఫలితాలు కలుగుతాయని హిందువులు భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖసంతోషాలు లభిస్తాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  చైత్ర పూర్ణిమ రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలు లక్ష్మిదేవి అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైత్ర పూర్ణిమ రోజున ఈ చర్యలు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది:


గురు దోషం తొలగిపోవాలంటే ఇలా చేయండి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చైత్ర పూర్ణిమ గురువారం, శుక్రవారాలు కావడం వల్ల ఈ రోజున గురుదోషం తొలగిపోవడానికి కొన్ని చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు పసుపును గుడ్డులో కలిపి అందులోనే అరటి వేరు వేసి ముద్దలా చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని మీరు కుడి చేతిపై వస్త్రా సహాయంతో కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి బలమైన స్థానంలోకి వెళ్తుంది. అంతేకాకుండా ఆనందం-శ్రేయస్సు, జ్ఞానం లభిస్తాయి.


వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి:
లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే, చైత్ర పూర్ణిమ రోజు సూర్యాస్తమయానికి ముందు.. ఒక పాత్రలో గంగాజలంలో కొద్దిగా పసుపు కలిపి ఈ పవిత్రమైన నీటిని ఇళ్లంతా చల్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ భారీగా పెరుగుతుంది.


Also Read: Gas Price: గుడ్‌న్యూస్.. గ్యాస్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్


డబ్బు పొందాలనుకుంటున్నారా?:
చైత్ర పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు పసుపు ముద్ద, బియ్యం, నాణేన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి..అల్మారాలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంపద-ధాన్యాలు పెరిగి సకల, సౌకర్యాలు లభిస్తాయి.


 విజయం కోసం.:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చైత్ర పూర్ణిమ రోజున విష్ణుమూర్తికి అభిషేకం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఇలా పసుపుతో అభిషేకం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook