KKR Vs RCB Highlights: 19 ఏళ్ల కుర్రాడు.. రూ.20 లక్షలతో IPLలోకి ఎంట్రీ.. RCBపై ఆర్‌సీబీపై విశ్మరూపం

Suyash Sharma in IPL 2023: తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు కేకేఆర్ స్పిన్నర్ సుయాష్‌ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం సుయాష్‌ శర్మ ఎవరంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కోల్‌కత్తా 81 రన్స్ తేడాతో గెలుపొందింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 10:59 AM IST
KKR Vs RCB Highlights: 19 ఏళ్ల కుర్రాడు.. రూ.20 లక్షలతో IPLలోకి ఎంట్రీ.. RCBపై ఆర్‌సీబీపై విశ్మరూపం

Who is Suyash Sharma IPL 2023: ఐపీఎల్ 2023లో తొలిసారి స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 రన్స్ చేయగా.. అనంతరం బెంగుళూరు జట్టు 17.4 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో తొలి గెలుపును నమోదు చేసుకుని.. పాయింట్ పట్టికలో ఖాతా ఓపెన్ చేసింది. అయితే కోల్‌కతా విజయంలో ముగ్గురు మిస్టరీ స్పిన్నర్లు అద్భుతం చేశారు. వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాష్‌ శర్మ ముగ్గురు స్పిన్నర్లు ఆర్‌సీబీ భరతం పట్టారు.

వీరిలో వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఈ సుయాష్‌ శర్మ అనే ఎవరు అని అందరూ వెతుకుతున్నారు. ఢిల్లీకి చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు.. తొలి మ్యాచ్‌లోనే తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ అండర్-25 జట్టుకు ఆడుతున్నాడు. లిస్ట్ ఏ, టీ20 గేమ్‌లు కూడా ఆడకుండా.. నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఈ యంగ్ ప్లేయర్. 

గతేడాది జరిగిన మినీ వేలంలో సుయాష్‌ శర్మను కేకేఆర్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. ఈడెన్‌ గార్డెన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టులో అప్పటికే మేటి స్పిన్నర్లు ఉన్నా.. కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా మూడో స్పిన్నర్‌ను రంగంలోకి దింపి ఫలితం రాబట్టాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ముచేయకుండా సుయాష్‌ శర్మ చెలరేగాడు.

Also Read: Gas Price: గుడ్‌న్యూస్.. గ్యాస్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

సుయాష్ తన 4 ఓవర్ల కోటాలో 7.50 ఎకానమీ రేటుతో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మలను ఔట్ చేసి ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్న సుయాష్ శర్మ.. భవిష్యత్‌లో కేకేఆర్‌కు కీ ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4, సుయాష్ 3, సునీల్ నారాయణ్ 2 వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ తీశాడు.

"నేను కేకేఆర్ శిబిరంలో మొదటిసారిగా సుయాష్‌ని కలిశాను. మూడో స్పిన్నర్ అవసరం వచ్చినప్పుడు సుయాష్‌ను జట్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. ఈ రోజు పిచ్ పొడిగా ఉండడంతో సుయాష్‌ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాం. చాలా బాగా బౌలింగ్ చేశాడు" అని మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ నితీష్ రాణా తెలిపాడు. 

Also Read: Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News