Chanakya Niti For Business:  లైఫ్ బిందాస్ గా ఉండటానికి ఎంతో కష్టపడతాం. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా విజయం సాధించలేరు. మరి కొందరు తక్కువ కష్టపడినప్పటికీ సులభంగా విజయం సాధిస్తారు. మనకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల జీవితంలో వైఫల్యం చెందుతాం. జీవితంలో విజయం ఎంత సులభంగా సాధించవచ్చో ఆచార్య చాణుక్యుడి (Acharya Chanakya) కొన్ని సూత్రాలు చెప్పాడు.  ఆ 5 సూత్రాలేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి సూత్రం: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయం చాలా ముఖ్యమైనది. ప్రతి వ్యక్తి ఏదైనా కొత్త పనిని సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించాలి. ఆ పని ప్రారంభించడానికి ఇది సరైన సమయమా? కాదా? అని ఆలోచించాలి. కాలం బాగానే ఉంటే కొత్తగా ఏదైనా చేయండి. అదే సమయంలో కాలం కలిసిరానప్పుడు ఓపికగా పనిచేయండి. లేకుంటే మనిషి కష్టమంతా వృధా అవుతుంది.


రెండవ సూత్రం: చాణక్యుడి ప్రకారం, మిత్రుడు మరియు శత్రువు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు విరోధిని స్నేహితుడిగా భావించి సహాయాన్ని అడగవద్దు, అది మీకే నష్టం కలిగిస్తుంది. 


మూడవ సూత్రం: ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం, మన దగ్గర సమాచారం లేకపోవడం కూడా మన బలహీనత కిందే లెక్క. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దాని గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకునే మెుదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల 100శాతం విజయం మీకు లభిస్తుంది. 


నాల్గవ సూత్రం: విజయాన్ని పొందడానికి నాల్గవ సూత్రం ఏమిటంటే, వ్యక్తి తన ఆదాయం మరియు ఖర్చు గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. పొదుపు చేసే అలవాటు ఉండాలి. ఎందుకంటే మీ చెడు కాలంలో అది బాగా పనికొస్తుంది. 


ఐదవ సూత్రం: మన బలాన్ని పెంచుకోవడంపై ఎప్పుడూ దృష్టి పెట్టాలని చాణక్యుడు చెప్పాడు. మరియు దానికి అనుగుణంగా పని చేయాలి. ఎందుకంటే మీరు సామర్థ్యం ప్రకారం ఎక్కువ పని చేస్తే, అది మీకే లాభం. 


Also Read: Lord Shiva Plant: నల్ల ధాతురా మెుక్క ఇంట్లో ఉంటే...అదృష్టం మీ వెంటే..! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook