Importance of Sarva Pitru Amavasya 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు తరచుగా తమ రాశిచక్రాలను మారుస్తూ ఉంటాయి. వీటి ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఈ నెల సెప్టెంబర్ 25 సర్వ పితృ అమావాస్య. ఈ రోజున చంద్రుడు సింహరాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున లక్ష్మీ నారాయణ యోగం మరియు బుద్ధాదిత్య యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. కన్య రాశిలో 4 గ్రహాలు (సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు) కలిసి సంచరిస్తున్నప్పుడు ఒక ప్రత్యేక యాదృచ్చికం ఏర్పడబోతుంది. దీని కారణంగా 3 రాశులవారుపై లక్ష్మీ దేవి డబ్బువర్షం కురిపిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం (Leo): ఈ రాశి వారికి ఈ సమయం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఎవరికైనా అప్పు ఇస్తే మీ వద్దకు తిరిగి వస్తాయి. ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ బాధ్యత పెరుగుతుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రావచ్చు. మాట్లాడేటప్పడు ఆచితూచి మాట్లాడండి. 


వృషభం (Taurus): సర్వ పితృ అమావాస్య నాడు గ్రహాల రాజు, రాణి, యువరాజులతో శుక్రుని కలయిక ఉండబోతుంది. ఈ సమయంలో మీ లవ్ సక్సెస్ అవుతుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. 


మేషం (Aries): ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారం మరియు వృత్తిలో వచ్చే సవాళ్లను అధిగమించ గలుగుతారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీకు పూర్వీకులు మరియు గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి.


Also Read: Shani Margi 2022: శని ప్రభావంతో ఈ రాశుల వారికి.. శుభ పరిణామాలు.. ఎందుకో తెలుసా..? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok