Panchak May 2023 Date And Time: జ్యోతిష్య శాస్త్రంలో పంచక కాలం చాలా అశుభకరమైనది..ఈ సమయంలో శుభ కార్యాలు చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మొత్తం జ్యోతిష్య శాస్త్రంలో 27  నక్షత్రాలు ఉంటాయి. వీటిలో చివరి ఐదు నక్షత్రాలు ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి కలిసినప్పుడు..పంచక కాలం ఏర్పడుతుంది. ఇదే క్రమంలో చంద్ర గ్రహం కుంభరాశిలో సంచారం చేస్తాయి. కాబట్టి ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది మే నెలలో మృత్యు పంచకం జరగబోతోంది. ఈ ఘడియలు శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మృత్యు పంచక సమయంలో ఎవరైన మరిణిస్తే..కుటుంబం లేదా గ్రామంలో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా మంది వరసగా మరిణించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర నష్టాలు కూడా కలుగుతాయి. 


Also Read:Jupiter Remedies: ఈ 2 రాశులకు గురు గ్రహం కటాక్షం తప్పనిసరి, ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలి


మృత్యు పంచక కాలం సమయం:
మృత్యు పంచక కాలం మే 13 ఉదయం 12.18 గంటలకు ప్రారంభమై మే 17న ఉదయం 7.39 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఈ సమయంలో పలు రకాల పనులు చేయడం చాలా హానికరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మృత్యు పంచకం సమయంలో ఇంటి పైకప్పులో మరమ్మతులు చేయడం, ఇంట్లో మంచాలు వేయడం వంటి పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరగవచ్చు.  ఈ క్రమంలో ఎవరైన మరణిస్తే ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


పంచక కాలం సమయంలో ఎవరైనా మరణిస్తే శాస్త్రోక్తమైన ఆచారాలతో దహన సంస్కారాలు చేయాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో ఐదు దిష్టిబొమ్మలను కూడా దహనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:Jupiter Remedies: ఈ 2 రాశులకు గురు గ్రహం కటాక్షం తప్పనిసరి, ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook