Diwali 2023: దీపావళి రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు..
Deepawali 2023: కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ పవిత్రమైన రోజున మీరు ఇంటికి తీసుకువచ్చే కొన్ని వస్తువులు మీకు లాభాలను ఇస్తాయి.
Diwali 2023: హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగనే దీపాల పండుగ లేదా దివ్వెల పండుగ అని పిలుస్తారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి. ఇది ఐదు రోజుల పండుగ. ఈ ఫెస్టివల్ ను నవంబరు 12న జరుపుకోనున్నారు. ఈరోజున లక్ష్మీదేవి మరియు గణేశుడిని పూజిస్తారు. అయితే ఈ రోజున మీరు ఇంటికి తీసుకువచ్చే కొన్ని వస్తువుల వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
మెటల్ తాబేలు
లోహపు తాబేలును హిందూ మతంలో పవిత్రమైనదిగా భావిస్తారు. దీపావళి సందర్భంగా ఈ మెటల్ తాబేలును ఇంటికి తీసుకువస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
లక్ష్మీదేవి-కుబేరుడి విగ్రహం
దీపావళి రోజున లక్ష్మీదేవి మరియు కుబేర దేవుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి మరియు కుబేరుడిని ఇంటికి తీసుకురావడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.
మట్టితో చేసిన వస్తువులు
మట్టి పాత్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం నమ్ముతాం. దీపావళి రోజున ఈ మట్టి పాత్రను తీసుకొచ్చి.. దానిని నీటితో నింపి.. ఇంటికి ఉత్తరం వైపును ఉంచండి. దీని వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.
Also Read: Shani Gochar effect: 2025 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook