Guru Gochar 2023: కొత్త ఏడాది ప్రారంభం కాగానే చాలా గ్రహాల రాశిలో కూడా మార్పు మొదలైంది. సాధారణంగా ఒక గ్రహం ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశిస్తే దానిని గ్రహ సంచారం అంటారు. గ్రహ సంచార ప్రభావం మొత్తం మానవ జీవితంపై కనిపిస్తుంది. గ్రహాల రాశిలో మార్పులు కొందరిపై శుభప్రభావాలు, మరికొన్నింటిపై అశుభ ప్రభావం చూపుతాయి. జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభ గ్రహంగా భావిస్తారు. కీర్తి, సంపదకు కారకుడిగా గురుడుని భావిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచాంగం ప్రకారం, హోలీ తర్వాత అంటే ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. ఇతడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సంచరించనున్నాడు. అన్నే సంవత్సరాల తర్వాత మేషరాశిలో బృహస్పతి మరియు సూర్యుని కలయిక జరగబోతోంది. వీరి కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. మేషరాశిలో గురుడు సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం
మేషం: దేవగురువు బృహస్పతి రాశి మారడం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
సింహం: దేవగురువు బృహస్పతి సంచారం వల్ల మీ శ్రమకు పూర్తి  ఫలితాలు లభిస్తాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తిలో లాభాలుంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మీరు సంతానం పొందే అవకాశం ఉంది.
మీనం: మేషరాశి వారికి బృహస్పతి సంచార సమయంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు భారీ డీల్ ను కుదుర్చుకుంటారు. 


Also Read: Lucky Zodiac Signs: ఆ 4 రాశులకు శుభయోగం, ఫిబ్రవరిలో కలిసిరానున్న అదృష్టం, అభివృద్ధిలో దూసుకుపోతారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook