Dhanteras 2022: భారతీయులు ఎంతగానో ఇష్టపడే దీపావళి పండగ రానే వచ్చేసింది. దీపావళి పండగకు ముందు భారతదేశ వ్యాప్తంగా ధన త్రయోదశి నరక చతుర్థి వంటి పండగలు జరుపుకుంటారు. అయితే ఈ పండగను ఈ సంవత్సరంలో అక్టోబర్ 22 (ఈరోజు), 23వ తేదీల్లో జరుపుకోవాలని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు తో ప్రత్యేకమైన రోజు.. ధన త్రయోదశి రోజున ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే.. వస్తువు విలువ 13 రేట్లు పెరిగే అవకాశాలుంటాయని శాస్త్రం పేర్కొంది. అంతే కాకుండా ఈ రోజున కొన్ని వస్తువులను చూడటం వల్ల శుభప్రదంగా కూడా పరిగణించారు. ఆ వస్తువులను చూడడం వల్ల అదృష్టం రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు సులభంగా తొలగుతాయని భక్తుల నమ్మకం. అయితే ధన త్రయోదశి రోజున ఎలాంటి వస్తువులను చూడడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాన్స్ జెండర్స్:
ధన త్రయోదశి రోజున ట్రాన్స్ జెండర్స్ ని చూడటం వల్ల, వారి ఆశీర్వాదాలు పొందడం వల్ల ధనవంతులవుతారని పురాణాలోని చెబుతున్నాయి. జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజున వారి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు పొందడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


నాణేలు:
ధన త్రయోదశి రోజున రోడ్లపై వెళ్లే గ్రామంలో వస్తువుతో పాటు నాణేలు దొరికితే శుభప్రదంగా చెప్పవచ్చు. సాక్షాత్తు లక్ష్మీదేవి అవి మీకు ఇచ్చినట్లని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా త్వరలోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


బల్లి కనిపించడం:
చాలామంది బల్లి కనిపించడం శకునంగా భావిస్తారు. అయితే బల్లి కనిపించడం కూడా ఓ మంచి పరిణామంగా చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ధన త్రయోదశి రోజున ఇంట్లో బల్లి కనిపించడం వల్ల అదృష్టం లభిస్తుందని అంతే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


పిల్లి:
ధన త్రయోదశి రోజున పెళ్లి కనిపించడం కూడా శుభప్రదం. ఉదయం పూట ఈరోజు పెళ్లి కనిపిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవ్వడమే కాకుండా వ్యాపారపరమైన సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు సులభంగా దూరమవుతాయి.


Also Read: Indian Army helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ 


Also Read: Indian Army helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook