Diwali Vastu Tips: భారతీయుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దేశమంతా సమైక్యంగా జరుపుకునే ఫెస్టివల్స్ లో ఇది ఒకటి.  చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali 2022 ) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి ఎప్పుడు?
దీపావళి నాడు అబాల గోపాలం కొత్త బట్టలు ధరించి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈరోజున ఘుమఘుమలాడే పిండి వంటలు చేస్తారు. ప్రతి ఏటా దీపావళిని ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి అక్టోబరు 24, సోమవారం నాడు వస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్టోబరు 25న జరుపుకోనున్నారు. ఈ పండుగకు మందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశి చేసుకుంటారు. ఈ దీపావళి పండుగకే దీపాల పండుగ, దివ్వెల పండుగ అనే పేర్లు ఉన్నాయి.  ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం అనవాయితీ. దీపావళి నాడు  లక్ష్మీ పూజ సాయంత్రం 5.39 గంటలకు ప్రారంభమై...సాయంత్రం 6.51 గంటలకు ముగుస్తుంది. 


దీపావళి రోజున ఈ వాస్తు చిట్కాలు పాటించండి:
1) దీపావళి రోజున మీ ఇల్లు లేదా ఆఫీసును శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలశక్తి ప్రవహిస్తుంది. అంతేకాకుండా వంటగది, స్టోర్ రూంను క్లీన్ చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది.  
2) దీపావళి పండుగ నాడు పగలిన అద్దాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, బొమ్మలు, వాడలేని వస్తువులు అన్నింటినీ తీసేయండి. ఇలా చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది.
3) ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. కాబట్టి ఉత్తర, ఈశాన్య దిశలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. నార్త్ లో వాస్తు దోషం ఉంటే మీరు ఆదాయాన్ని కోల్పోతారు. లివింగ్ రూమ్‌లో ఉత్తరం వైపున ఉన్న అక్వేరియం మరియు టెర్రస్‌పై పక్షులకు నీరు నింపిన గిన్నె ఉండటం అదృష్టంగా భావిస్తారు. 
4) దీపావళి రోజున మీ ఇంటిని లైట్లు, పువ్వులు, రంగోలి, కొవ్వొత్తులు, గులాబీ రేకులు మరియు ఇతర అలంకార వస్తువులతో డెకరేషన్ చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి తన అనుగ్రహన్ని కురిపిస్తుంది.  


Also read: Shani Margi 2022: దీపావళికి ముందు మార్గంలోకి శనిదేవుడు.. ఈరాశులపై డబ్బు వర్షం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook