Shani Margi 2022: దీపావళికి ముందు మార్గంలోకి శనిదేవుడు.. ఈరాశులపై డబ్బు వర్షం ఖాయం..

Shani Margi 2022: అక్టోబరు 23న న్యాయదేవుడు శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ఇదే రోజు ధంతేరాస్ కావడం విశేషం. దీంతో కొన్ని రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 11:05 AM IST
Shani Margi 2022: దీపావళికి ముందు మార్గంలోకి శనిదేవుడు.. ఈరాశులపై డబ్బు వర్షం ఖాయం..

Shani Margi 2022: పంచాంగం ప్రకారం, శనిదేవుడు జూలై 12న మకరరాశిలో తిరోగమనం  చేశాడు. అప్పటి నుంచి అదే స్థితిలో ఉన్నాడు.  ఈ నెల 23న శనిగ్రహం ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi in Capricorn 2022) రానున్నాడు. అదే రోజు ధనత్రయోదశి కావడం విశేషం. ధంతేరాస్ రోజున ధన్వంతరితోపాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. శని సంచారం, ధన్తేరస్ ఒకరోజు రావడం వల్ల కొన్ని రాశులవారు భారీగా ధనాన్ని పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

శని  ప్రత్యక్ష సంచారం ఈ రాశులవారికి శుభప్రదం
తుల (Libra): శని మార్గి వల్ల మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచే ఇతర వనరులు ఏర్పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  
మేషం (Aries): శని ప్రత్యక్ష సంచారం వల్ల ఈసారి మీ కెరీర్‌లో ప్రమోషన్‌కు అవకాశాలు ఉన్నాయి. శనిదేవుడు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. ఏదైనా జాబ్ లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
సింహం (Leo): శని సంచారం వల్ల మీ శత్రువులు ఓడిపోతారు. పనులన్నీ సకాలంలో  పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా దీని ద్వారా మీరు లాభపడతారు.  కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. పోటీపరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. 

Also Read: Mercury Transit 2022: మరో వారం రోజుల్లో బుధుడు సంచారం... ఈ 3 రాశులకు ఆకస్మిక ధనప్రాప్తి... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News