Importance Of Holashtak: హిందూ మతం ప్రకారం ప్రతి పండుగకు కొన్ని నియామాలు రూపొందించబడ్డాయి. అవి తప్పనిసరిగా పాటించాలి. లేదంటే అనేక రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. హోలీ (Holi) పండుగకు, దాని ముందు 8 రోజులపాటు హోలాష్టక్కు  ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. హోలాష్టక్ (Holashtak 2022) ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని శుభ కార్యాలు జరగవు. అయితే, ఈ సమయం దేవుడిని ఆరాధించడానికి ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నేటి (మార్చి 10, 2022) నుంచి హోలాష్టక్ ప్రారంభమవుతుంది. ఇది మార్చి 17న హోలికా దహన్ రోజున ముగుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలాష్టకం (Holashtak) 8 రోజులు భగవంతుడిని పూజించడం చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది. హోలాష్టక్ సమయంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి రూపంగా చెట్టు కొమ్మను నేలపై ఉంచి దానిపై రంగు వస్త్రాన్ని కట్టే సంప్రదాయం ఉంది. దీని తరువాత 8 రోజులు, ఆ మొత్తం ప్రాంతంలో వివాహం, క్షవరం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించబడవు మరియు దేవుడిని మాత్రమే పూజిస్తారు.


Also Read: Sun transits: మీన రాశిలోకి సూర్యుడు.. 6 రోజులు తర్వాత ఆ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..


హోలాష్టకం సమయంలో ఈ పనులు చేయకండి: 
**హోలాష్టకం తర్వాత 8 రోజులు ఎలాంటి శుభ కార్యాలు చేయవద్దు. ఈ సమయంలో నామకరణం, గృహ ప్రవేశం, కళ్యాణం మొదలైన 16 క్రతువులు పొరపాటున కూడా చేయరాదు. ఇలా చేయడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి
** హోలాష్టకం సమయంలో యాగ కర్మలు కూడా చేయకూడదు.
** కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తమ తల్లి ఇంటిలోనే ఉండాలి. అందుకే సాధారణంగా కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను హోలాష్టక్ కంటే ముందే పుట్టంటికి వెళ్లిపోతారు. 


(గమనిక: ఇక్కడ అందించిన వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE మీడియా దీనిని ధృవీకరించలేదు.)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook