Tulasi plant: తులసిమొక్క వద్ద పొరపాటున కూడా ఈ 5 పెట్టకండి.. ఆ ఇంట ఎప్పుడూ ఆర్థికసమస్యలేనట..
Tulasi Plant Vastu Tips: హిందూమతంలో తులసిమొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ పూజిస్తాం. వాస్తుప్రకారం తులసిమొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, పొరపాటున కూడా తులసిమొక్క పక్కనే ఈ 5 వస్తువులు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Tulasi Plant Vastu Tips: హిందూమతంలో తులసిమొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ పూజిస్తాం. వాస్తుప్రకారం తులసిమొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, పొరపాటున కూడా తులసిమొక్క పక్కనే ఈ 5 వస్తువులు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అవేంటో తెలుసుకుందాం.
ముళ్లమొక్క..
వాస్తుప్రకారం తులసిమొక్కను తూర్పు లేదా ఈశాన్యం దిశలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే పొరపాటున కూడా తులసి మొక్క పక్కన ముళ్ల మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గులాబీ, కాక్టస్ వంటి ముళ్ల జాతి మొక్కలు తులసి మొక్క పక్కనే ఏర్పాటు చేయకూడదు. ఇది ఇంటికి కూడా నెగిటివిటీని పెంచుతుంది.
శివలింగం..
వాస్తుప్రకారం శివలింగాన్ని కూడా తులసి మొక్క పక్కనే పెట్టకూడదు. బిల్వ మొక్క పక్కన కూడా తులసిని పెట్టకూడదు. పూర్వజన్మలో తులసి రాక్షసుడైన జలంధరుడి భార్యగా నమ్ముతారు. శివుడు అతడిని వధిస్తాడు. అందకే తులసి మొక్క పక్కనే శివుడు సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు. కానీ, విష్ణుపూజలో తులసి లేనిదే పూజ పూర్తికాదు.
వినాయకుడు..
పురాణాల ప్రకారం వినాయకుని చూసి ఒకనాడు తులసి పెళ్లిప్రతిపాదన తీసుకువస్తుంది. దీనికి వినాయకుడు ససేమీరా అనడంతో ఆమె విఘ్నేశ్వరుని రెండు పెళ్లిళ్లు అవుతాయని శపిస్తుంది. అప్పటి నుంచి వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించరు. అంతేకాదు తులసి మొక్క పక్కన కూడా వినాయకుడి విగ్రహం వంటివి పెట్టకూడదు.
చెప్పులు..
వాస్తుప్రకారం పాదరక్షకాలు కూడా తులసి మొక్క దగ్గర్లో పెట్టకూడదు. ఇంటికి వచ్చాక హడావుడిలో చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడే చెప్పులు వదిలేయడం మనం చాలా ఇళ్లలో చూసే ఉంటాం. అయితే, చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఓ దిశ ఉంటుంది. అంతేకానీ గుమ్మం ముందు, పవిత్రమైన మొక్కలు ఉండే ప్రాంతంలో చెప్పులు వదలకూడదు. ఇది ఇంటికి త్వరగా నెగిటివిటీని పెంచుతుంది.
ఇదీ చదవండి: వాస్తు ప్రకారం చీపురు ఈ దిశలో పెట్టారంటే అష్టదరిద్రం తప్పదు..
చెత్తబుట్ట..
తులసి మొక్క పక్కన చెత్త వేసే డస్ట్ బిన్ పెట్టడం కూడా అశుభం. ఇలా చేయడం వల్ల తులసిమాతకు కోపం వస్తుంది. ఆ ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. సాయంత్రం వేళ కూడా తులసి కొమ్మలను ఆకులను తెంపకుండా జాగ్రత్తపడండి..
ఇదీ చదవండి: విజయ ఏకాదశిరోజు ఈ పనులు పొరపాటున చేయకండి.. ఇలా పూజించండి..
వాస్తు ప్రకారం తులసికి ఏకాదశి, ఆదివారం రోజుల్లో నీరు పెట్టకూడదు. ఈరోజుల్లో అమ్మవారు ఉపవాసం పాటిస్తారు. ఇక సాయంత్రం సమయంలో కూడా తులసిమొక్కకు నీరు పెట్టకూడదు. తులసి మొక్క పక్కన మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఏర్పాటు చేసుకుంటే శుభదాయకం. శుక్రవారం రోజు తులసి ఆకులను తుంచకూడదు. గురువారం పూజలో తులసి ఆకులు తప్పకుండా ఉండాల్సిందే..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter