Broom vastu Tips: చీపురును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు హిందూమతం ఆచరించేవారు. వాస్తులో చీపురుకు ప్రత్యేక స్థానం ఉంది. చీపురు ఇంట్లో పెట్టే దిశకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, చీపురు తప్పుడు దిశలో పెట్టుకుంటే దరిద్రం తప్పదంటున్నారు వాస్తు నిపుణులు.. అంతేకాదు సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదని అంటారు. దీంతో ధననష్టం వాటిల్లుతుంది. పొరపాటున కూడా చీపురును కాళితో తొక్కకూడదు అని మన పెద్దలు కూడా చెబుతారు.సాధారణంగా ప్రతి ఇంటిలో చీపురు ఉంటుంది. ముఖ్యంగా చీపురు లేకుండా ఏ ఇంటినీ శుభ్రం చేయలేం. ఇంట్లోని చెత్తను బయటకు పారదోలడానికి చీపురును ఉపయోగిస్తారు.ఇది లేకుండా పనే కాదు. అయితే, చీపురుతో పని అయిపోయిన తర్వాత చాలామంది దాన్ని అడ్డదిడ్డంగా పెడతారు. వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోవడం మాత్రమే కాదు, ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి.
చీపురు పెట్టడానికి ఓ దిశ వాస్తు నియమం ఉంది. దీని అనుసరించి పెడితే ఇంట్లోకి లక్ష్మీ ప్రవేశిస్తుంది. కాకుండా తప్పుడు దిశలో ఏర్పాటు చేసుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది.
ఎప్పుడు కూడా చీపురును ఇంటికి నైరుతి దిశలో పెట్టుకోవాలి. ముఖ్యంగా చీపురును బయట వ్యక్తులకు కనిపించకుండా ఈ మూలన పెట్టుకోవడం మంచిది.
ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, లేదా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చీపురును నేరుగా కనిపించేలా పెట్టకూడదు. పైగా చీపురును ఎప్పుడు నిలబెట్టకూడదు. అంతేకాదు చీపురును వంటిల్లు లేదా బెడ్ రూంలో కూడా పెట్టకూడదు. ఇది కాకుండా వ్యతిరేక దిశలో చీపురును పెడితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
ఇదీ చదవండి: విజయ ఏకాదశిరోజు ఈ పనులు పొరపాటున చేయకండి.. ఇలా పూజించండి..
వాస్తు ప్రకారం చీపురుతో ఇళ్లు ఉడ్చేటప్పుడు కూడా దిశ ఉంటుంది. ఈశాన్యం నుంచి నైరుతి మూల వైపుగా ఉడ్చాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అప్పులు తీరతాయి. ముఖ్యంగా ఇంటి గడపకు చీపురు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ఇష్టానుసారంగా చీపురును గడపకు తగిలించడం చూస్తాం. ఇది అపచారం.
ఇదీ చదవండి: మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను దానం చేస్తే..రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
మీరు ఎప్పుడైనా కొత్త చీపురును కొనుగోలు చేయాల్సి వస్తే శనివారం మార్చాలి. కొన్ని ప్రత్యేక దినాలు అంటే దీపావళి, ధంతేరాస్ సమయంలో చీపురును ఏదైనా దేవాలయాలకు దానం చేస్తే ఆ వ్యక్తి అదృష్టమే మారిపోతుంది. వృత్తివ్యాపారాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు కలలో చీపురు కనిపిస్తే కూడా చాలామంచిది. ఎందుకంటే చీపురు లక్షీదేవికి ప్రతీక. ఇలా మీకు కలలో చీపురు కనిపిస్తే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. అయితే, పొరపాటున కూడా ఇంటి ఈశాన్యదిశలో చీపురును పెట్టకూడదు. దీంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter