Do Not Offer To Lord Shiva: సోమవారం శివుడికి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు శివ పూజ చేస్తారు. గుడిలోకి వెళ్లి శివుని అభిషేకం వంటివి నిర్వహిస్తారు. అయితే శివ పూజలో శివుడికి ఇష్టం లేని కొన్ని వస్తువులు ఉంటాయి. కేవలం ఏ దేవుడి పూజలోనైనా వారికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. అప్పుడే వారి అనుగ్రహం పొందుతారు. అయితే, పురాణాల ప్రకారం శివుడికి ఇష్టంలేని వస్తువులు కూడా ఉన్నాయి. ఆయనకు సమర్పించడం వల్ల ఆగ్రహం వస్తుంది అలాంటి వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి..
శివ పూజలో పురాణాల ప్రకారం తులసి సమర్పించకూడదు పురాణాల కాలంలో తులసి భర్తను జలంధరుని శివుడు నాశనం చేస్తాడు దీంతో శివుడి పై ఆమె ప్రతీకారం పెంచుకుంటుంది అందుకే శివ పూజలో తెలిసిన సమర్పించకూడదు కానీ విష్ణు పూజ చేయవచ్చు.


కొబ్బరి నీరు..
కొబ్బరి నీరు చాలామంది తెలియక కొబ్బరికాయకు పగల కొట్టి శివుడికి సమర్పిస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు పురాణాల ప్రకారం కొబ్బరికాయ పగల కొట్టి ఆ నీటిని శివుడికి సమర్పించడం ఉండదు.


చంప..
పురాణాల ప్రకారం అంటే పువ్వులు కూడా శివుడికి సమర్పించారు శివుడి పూజలో వీటిని పెడితే ఆయన శపించడం ఆయన శాపానికి గురికాక తప్పదు.


బిల్వ పత్రం..
బిల్వ పత్రం శివుడికి ఎంతో ఇష్టమైన ఆకు అయితే దీన్ని దీనిలో అనేక కూలింగ్ గుణాలు ఉంటాయి అంతేకాదు ఇందులో థెరపిటిక్ గుణాలు ఆయుర్వేదంలో వినియోగిస్తారు. అయితే శివ పూజలో బిల్వపత్రం సమర్పించవచ్చగానే ఏవైనా పురుగులు కుట్టిన ఆకును మాత్రం సమర్పించకూడదు.


ఇదీ చదవండి: ఈ 4 తేదీల్లో పుట్టిన వారికి వైవాహిక జీవితం కత్తి మీద సాము వంటిదేనట..!


పసుపు..
సోమవారం పురాణాల ప్రకారం పసుపును కూడా శివుడికి సమర్పించకూడదు ఎందుకంటే పసుపును ఆడవారు వినియోగిస్తారు శివ పూజలో ఇది నిషిద్ధం.


కుంకుమపువ్వు..
కుంకుమపువ్వును శివుడికి అభిషేకం చేయకూడదు కుంకుమ పువ్వు ని కుంకుమను కూడా ఉపయోగించకూడదు చేయడం వల్ల శివుడి ఆగ్రహానికి గురికాక తప్పదు.


ఇదీ చదవండి: మనీప్లాంట్‌ మొక్క ఈ మూలన పెడితే ధనలక్ష్మి కటాక్షమే.. !


అంతేకాదు ఇత్తడి పాత్రల్లో పాలు లేదా నీటిని సమర్పించకూడదు కేవలం రాగి పాత్రలోనే సమర్పించాలి. ఈ కొంతమంది తెలియక ఇలా చేస్తారు కానీ నెయ్యి పాలు పెరుగు వంటివి కేవలం రాగి పాత్రలో మాత్రమే శివుడికి అర్పించాలి అదే శుభం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి