Numerology: ఈ 4 తేదీల్లో పుట్టిన వారికి వైవాహిక జీవితం కత్తి మీద సాము వంటిదేనట..!

Marital Life Numerology: ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నాళ్లు నిలబడుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రతి ఒక్కరూ స్వాతంత్రం కోరుకున్న దిశగా వెళ్లడం వల్ల ఇలా జరుగుతుంది.
 

1 /5

అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి వైవాహిక జీవితం అనేది ఒక పెద్ద సమస్య కావచ్చు. రెండు జీవితాలు మూడు ముళ్ళతో ఏడు అడుగులు వేసి నూరేళ్లు పయనించే ఈ బంధం నిలపడటానికి ప్రస్తుతం లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే జ్యోతిష్య ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి అనేది ఒక సమస్యగా మారుతుంది ఆ తేదీలు ఏంటో తెలుసుకుందాం.  

2 /5

Radix 1..  ర్యాడిక్స్‌ 1 అంటే ఏదైనా నెలలో 1,10, 19, 28 తేదీల్లో పుట్టినవారికి వర్తిస్తుంది. వీరి రాడిక్స్ 1 అవుతుంది. మీ తేదీల్లో పుట్టిన వారికి రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు. సాధ్యమైనంత వరకు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇద్దరిలో సర్దుకుపోయే తత్వం లేకపోతే మాత్రం వారి వైవాహిక జీవితం అస్సలు నిలబడదు.

3 /5

Radix 4.. తేదీ 4, 13, 22, 31 పుట్టినవారికి రాడిక్స్ 4 వస్తుంది. వీళ్ల రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడడానికి చాలా కష్టతరమే.  కొంత మంది తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవటం వల్ల పెళ్లిలో జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టిన వారికి షార్ట్ టెంపర్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో వారు విడాకుల తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

4 /5

Radix 6.. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ 6 అవుతుంది. విపరీతంగా కోపం పెంచుకోవడంతో ఇలా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు తమ భాగస్వామితో తక్కువ సమయం గడుపుతారు. దీంతో వారి మధ్య ప్రేమకు స్థలం ఉండదు. అదేవిధంగా వైవాహిక జీవితం కొనసాగదు.

5 /5

Radix 9.. 9 18 27 ఈ తేదీల్లో పుట్టిన వారికి రాడిక్స్ 9 అవుతుంది. వీళ్ల లైఫ్ లో కూడా పెళ్లి అనేది ఒక గండం వంటిదే. జీవితంలో మూడో వ్యక్తి రావడం వల్ల ఆ వీరి వైవాహిక జీవితం నిలబడదు. దీంతో ఒకరిపై మరొకరు బద్ధశత్రువుల్లా మారతారు. రిలేషన్‌ షిప్‌కు బ్రేక్‌ పడుతుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)