Lakshmi Devi Pooja: లక్ష్మీదేవి అనుగ్రహముంటే అంతా బాగుంటుందనేది పండితులు చెప్పేమాట. మరి ఆ లక్ష్మీదేవి తక్షణ కటాక్షం కోసం ఏం చేయాలి, ఎలాంటి పూజలు ఎప్పుడు చేయాలనేది జ్యోతిష్యశాస్త్రంలో వివరంగానే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత ఆచారాలు, విశ్వాసాల ప్రకారం ప్రతిరోజుకీ ఓ విశేషం, ప్రాధాన్యత ఉన్నాయి. వారంలోని ఏడు రోజులూ ఎవరో ఒక దేవతకు సమర్పితం. గురువారం నాడు విష్షు భగవానుడికి, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అంకితం. ఒకవేళ మీరు లక్ష్మీ దేవి కటాక్షం పొందాలనుకుంటే..కేవలం శుక్రవారమే కాకుండా..గురువారం నాడు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. వారంలోని ఈ రెండు రోజులు లక్ష్మీదేవిని పూజిస్తే..సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు. దాంతోపాటు ఇంట్లో ఆనందం వర్ధిల్లుతుంది. గురు, శుక్రవారాల్లో ఏయే పూజలు చేస్తే..లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో చూద్దాం..


గురువారం నాడు విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవి పూజలు చేస్తే..సుఖ సంతోషాలు లభిస్తాయి. గురువారం నాడు లేదా శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుడికి వెళ్లి..కమలం పూవు, శంఖం వంటివి సమర్పించాలి. లక్ష్మీదేవిని వెన్న, పాయసం వంటివి నైవేద్యంగా పెడితే..లక్ష్మీదేవి ప్రసన్నమౌతుందంటారు. భక్తుల్ని కటాక్షిస్తుందని చెబుతారు. శుక్రవారం నాడు నల్లని పక్షులకు పంచదార తినిపిస్తే ఉపయోగముంటుంది. 


దాంపత్య జీవితంలో ఆనందం కోసం విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. దాంతోపాటు శుక్రవారం నాడు మీ బెడ్రూమ్‌లో ఏదైనా పక్షుల జంట ఫోటో ఉంచితే..లాభముంటుంది. సంతాన ప్రాప్తి కోసం..సుఖం కోసం గురు, శుక్రవారాల్లో గజలక్ష్మి ఉపాసన చేస్తే లాభముంటుందట. శుక్రవారం నాడు ఓ పసుపు వస్త్రంలో 11 పసుపు ముడులేయాలి. ఆ తరువాత ఓం వక్రతుండాయహ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తరువాత లక్ష్మీదేవి ఆశీర్వాదం తీసుకుంటూ...ఈ వస్త్రాన్ని ఖజానాలో భద్రపర్చాలి. 


ఒకవేళ మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే..ఇంటి ప్రధాన గుమ్మం ఓ మూలన..కొద్దిగా ఎరుపు రంగు పౌడర్ చల్లాలి. దానిపై నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసేటప్పుడు మనసులో డబ్బు సమస్యల్నించి విముక్తి కల్గించమంటూ ప్రార్ధించాలి. ఆ తరువాత ఆరిపోయిన దీపాన్ని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవిని పూర్తి విధి విధానాలతో పూజించాలి. దాంతోపాటు శ్రీ సూక్తం పఠనం, విష్ణ సహస్ర నామ పఠనం చేయాలి. ఇలా చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి.


Also read: Lakshmidevi Pooja: లక్ష్మీదేవి కటాక్షంకై ఉదయం-సాయంత్రం ఈ స్తోత్రం పఠిస్తే చాలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook