Auspicious Time for Shani Puja: శనీశ్వరుని  ప్రతికూల ప్రభావం తగ్గి మనపైకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొంది మన జీవితంలో ఉన్నతంగా మనం ఎదగాలి అంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి దైవానికి వారంలో ఒకరోజు వారంలో ఒక నక్షత్రాన్ని ఒకవారం ప్రత్యేకంగా ఉంటుంది.  ఆ గ్రహానికి సంబంధించిన కొన్ని ప్రీతికరమైనటువంటి వస్తువులను మన పెద్దలు నిర్దేశించారు.ఆయా సమయాలలో ఆయాగ్రహాలకు నిశ్చయించిన విధంగా మనము పూజలు, దానాలు, జపాలు నిర్వహించనట్లయితే ఆయా గ్రహాల పీడ అనేది మనకి ఉండదు. అయితే జాతకంలో కొన్నిసమయాల్లో వాటి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారి సత్ఫలితాలను అందించవు. అలాగే అన్ని గ్రహాల మాదిరిగానే శని గ్రహానికి కూడా కొన్ని ప్రత్యేకం ఉంది. శని త్రయోదశి తిధి ఇంకా శనిహోరాకాలం అలాగే తిథులు ఉంటాయి. దానం అనేది శనీశ్వరునికి ప్రత్యేకం. శనిదశ తొలగించుకోవడానికి ప్రధానంగా చేయాల్సిన పని దానం చేయడంగా నిర్ణయించబడ్డాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే శనీశ్వరునికి ఏ సమయంలో ఎలా పూజ చేయాలో చూద్దాం. ముఖ్యంగా శని యొక్క ప్రభావం మనపై ప్రతికూలంగా ఉంది అని తెలిపే సూచనల్లో ఒకటి మన ఇంట్లో ధనం అనేది వృథాగా ఖర్చు కావడం.అలాగే మనమూ చేయని తప్పుకు సంబంధించి మనపై నిందలు రావడం. మన ఇంట్లో సభ్యులు ఇంకా బయటివారు మన మాటకు విలువ ఇవ్వకపోవడం మనల్ని చాలా చులకన భావంగా చూడటం.


ఇదీ చదవండి: ఇంట్లో ఈ 5 మొక్కలు నాటకూడదు.. పెడితే కష్టాలను కోరితెచ్చుకున్నట్లే..


 మన ఆరోగ్యానికి సంబంధించి జీర్ణ సంబంధ సమస్యలు వెన్నునొప్పి అలాగే ఎప్పుడూ బద్ధకంగా నిద్రపోవాలి అనిపించడం. అలాగే ఉన్నట్టుండి మనం బరువు పెరగడం, అలాగే అతినిద్ర. ఇలాంటివి అన్ని కూడా శని యొక్క ప్రతికూల ప్రభావం కారణంగానే జరుగుతుంటాయి.


అంతేకాదు మనం మనకు తెలియకుండా వ్యసనాల వైపు ఎక్కువగా ఆరాటపడటం అలాగే మన ఉద్యోగానికి సంబంధించి ఎంత కష్టపడుతున్నా కానీ పనులు పూర్తికాకపోవడం. ఇంకా ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఉద్యోగం దొరకకపోవడం ఇలాంటివి అన్ని కూడా శనీశ్వరుని ప్రతికూల ప్రభావం కారణమే..


శనికి ప్రత్యేక పూజలు చేయాలి. ప్రతి శనవారం రోజు శని హోరా కాలంలో పూజించాలి అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యాహ్నం 1 నుంచి 2, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్య కాలంలో ప్రత్యేకకాలంలో పూజించాలి.శనిత్రయోదశి రోజంతా అనుకూలమైన సమయం. ఆరోజు తలస్నానం చేసి ప్రాణాయామం చేసి శనికి 11 ప్రదక్షిణలు చేసి శని మంత్రాలు, అష్టోత్తరాలు, మంత్రం చదువుతూ ఒక్కో పూవు శనిదేవుడికి సమర్పించాలి. 


ఇదీ చదవండి:  గురుచంద్రుల కలయికతో గజకేసరియోగం.. ఈ రాశికి లాటరీ తగిలినట్టే..


ప్రతి మంగళ, శనవారాల్లో ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజు  ఆంజనేయ స్వామికి చందనం పెట్టించడం వంటివి చేయాలి. శని ఎన్ని కష్టాలను పెట్టిన వెళ్లే సమయంలో మంచి ఫలాలను అందిస్తాడు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి