Shanidev Remedies: శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి శనివారం నాడు ఇలా చేయండి..
Shanidev: శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శని దేవుడిని పూజించడం మరియు చర్యలు తీసుకోవడం వంటివి చేస్తే అతని కోపం నుండి తప్పించుకోవచ్చు.
Shaniwar Shanidev Remedies: మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని (Shanidev) న్యాయదేవుడు, కర్మదాత అని కూడా పిలుస్తారు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి జీవితం సర్వనాశనమవుతుంది. శని అనుగ్రహం ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి కొద్ది రోజుల్లోనే ధనవంతుడు అవుతాడు. శని కృప బిచ్చగాడిని కూడాబిలియనీర్ చేస్తుంది. శని కోపం ధనవంతుడిని కూడా దరిద్రుడిగా మారుస్తుంది. శనిదేవుడి కటాక్షం పొందడానికి, శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. శనివారం నల్ల ఉల్లితో పరిహారంతో చేస్తే శనిదేవుడి ప్రసన్నడువుతాడు.
శనివారం ఈ పరిహారాలు చేయండి
>> శనివారం నాడు శని దేవుడికి నల్ల ఉల్లిని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే, జాతకంలోని శని దోషం కూడా తొలగిపోతుంది.
>> శనివారం నాడు రావి చెట్టుకు నీరు పోయండి. ఇలా చేయడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే, అనేక రకాల సమస్యల నుండి బయటపడండి.
>> శనివారం నాడు రెండు నల్ల ఉల్లిపాయలను తీసుకుని వాటికి పెరుగు, పచ్చిమిర్చి రాయాలి. దీని తరువాత, వాటిని పీపాల్ చెట్టు క్రింద ఉంచండి. ఇలా 21 రోజులు చేస్తే మనిషికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
>> జ్యోతిష్యం ప్రకారం, శనివారం నల్ల వస్తువులను దానం చేయడం మంచిది. నల్ల ఉరద్ పప్పు, నల్ల బట్టలు, నల్ల నువ్వులు లేదా నల్ల శనగ పప్పును ఎవరైనా పేదవారికి దానం చేయండి. ఇది వ్యక్తిపై సడే సతి ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది.
Also Read: Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook