Mauni Amavasya Pooja: హిందూ శాస్త్రాల్లో కొన్ని విశిష్ట రోజులు.. ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. ఆ విశిష్టమైన రోజుల్లో పూజ పురస్కారాలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ క్రమంలోనే అత్యంత విశిష్టమైన మౌని అమావాస్య వచ్చింది. శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య రావడంతో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పరమ పవిత్రమైన ఈ సమయంలో మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు దానధర్చేమాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. మౌన అమావాస్య రోజు దానధర్మాలతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు దానధర్మాలతో ధనలాభం కలుగుతుంది‌. ఇలా చేస్తే డబ్బుకు లోటు అనేదే ఉండదనే విశ్వాసం ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mauni Amavasya 2025: మహాకుంభమేళాలో రేపు మిస్సయితే.. మళ్లీ జన్మజన్మలకు ఈ అదృష్టం రాదు


పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణాలు సమర్పించాలి. తర్పణాలు చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మోని అమావాస్య పర్వదినాన పేదలకు మీ శక్తిసామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి. పేదలకు ఉన్ని దుస్తులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు‌. దానం చేయడం వల్ల మీ జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని వేద పండితులు చెబుతున్న మాట‌.


Also Read: Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ


మానసిక ప్రశాంతత..
మౌని అమావాస్య రోజు చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. శ్రవణ నక్షత్రంలో వచ్చిన మౌని అమావాస్య పరమ పవిత్రమైనది. మౌని అమావాస్య సమయంలో గురుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మహా కుంభ మేళాలో రాజస్నానం చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలో వచ్చిన తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మౌని అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. ఈరోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆ నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు కలగవు.. మౌని అమావాస్య రోజు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రక్షమాలను ధరించాలి. రుద్రాక్షమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.