Astro Tips: మన హిందూ పురాణాల ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే అవి ఫలవంతం అవుతాయి. చాలామంది ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోతారు. ఇక తమవల్ల కాదు అని బాధపడేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈరోజు అద్భుతమైన రెమిడీ.. జోతిష్య నిపుణులు ఏం చెప్పారో తెలుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. ఆ పరిహారమే కార్యసిద్ధి హనుమాన్ పూజ. ఏదైన ఒక శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవాలి. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నాన కాలకృత్యాలు అయిన పిదప మంచి పొడి ఆరెంజ్ లేదా తెల్లని దుస్తులను ధరించాలి. సింధూరాన్ని ముందురోజే ఇంటికి తెచ్చుకోవాలి. ఆవునెయ్యిలో కలిపి ఈ సింధూరాన్ని ధరించాలి. 


ఆ తర్వాత ఇంట్లో సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉన్నా లేదా ఆంజనేయ స్వామి ఫోటో ఉన్న పూలు, దీపాలు, బెల్లం లేదా అరటిపండ్లు పెట్టి స్వామివారిని పూజించాలి. ఇంట్లో ఈ పూజ చేసుకోకపోతే మీ ఇంటికి దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి చేసుకోండి.అక్కడ స్వామివారికి ఐదు అరటిపండ్లు, పూలు, తులసిదళాలు సమర్పించాలి. ఐదు ప్రదక్షిణలు చేయాలి. దేవాలయంలో కూర్చొని ఈ 108 లేదా 48 సార్లు మంత్రాన్ని పఠించాలి.


ఇదీ చదవండి: అప్పులు పెరిగిపోతున్నాయా..? ఇలా చేయడం వల్ల ఆదాయ మార్గం తెరుచుకుంటుంది


త్వమస్మిన్ కార్యనిర్యోగే
ప్రమాణం హరిసత్తమ
హనుమన్ యత్న మాస్థాయ
దుఃఖక్షయ కరోభవ


అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవకిం వద
రామ దూత కృపాసింధో
మత్కార్యం సాధయ ప్రభో


ఇదీ చదవండి: Astrology Tips : శనివారం పొరపాటున ఈ 2 రంగుల దుస్తులు ధరించకండి.. లేదంటే మీకే ఇబ్బందులు..


ఈ శక్తివంతమైన మంత్రాలను నేర్చుకొన్ని ఉండాలి. దేవాలయ ప్రాంగణంలో 104 సార్లు జపించాలి. ఆ తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోవాలి. ఆ తర్వాత శక్తి మేరకు మీ ప్రయత్నాలు నిరంతరంగా చేయాలి. తప్పకుండా స్వామివారి మీ కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ పూజ 41 రోజులు చేసుకోవాలి. మద్యమాంసాల దగ్గరికి పోకూడదు, ఎవరితోనూ విరోధం పెట్టుకోకుండా ఉండాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి