Holi 2024: కొత్తగా పెళ్లైన మహిళ హోలీని అత్తారింట్లో జరుపుకోకూడదు? ఎందుకో తెలుసా?
Holi 2024: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది.
Holi 2024: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది. ఈనేపథ్యంలో హోలీ పండుగను కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం అత్తవారింట జరుపుకోకూడదనే అనావయితీ ఉంది. ఇది నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం...
ఫాల్గుణమాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ప్రభుత్వ సెలవుదినంగా కూడా పాటిస్తారు. హోలీ సందర్భంగా నిర్వహించే హోలికా దహనాన్ని కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ అత్తవారింట చూడకూడదట. ఒకవేళ పొరపాటున అత్తాకోడళ్లు కలిసి హోలీకా దహనం చూస్తే అత్తాకోడళ్లకు మధ్య గొడవలు జరుగుతాయి. అంతేకాదు హోలికా దహనాన్ని గర్భిణులు కూడా చూడకూడదని పండితులు చెబుతారు. అదే కొత్తగా పెళ్లైన మహిళ పుట్టింట హోలీ పండుగ జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నారా..?.. మీ జీవితంలో ఈ అరిష్టాలు తప్పవంటున్న జ్యోతిష్యులు..
పురాణాల ప్రకారం హోలీ పండుగ గురించి రకరకాల కథనాలు చెబుతారు. శివుడుని పార్వతిదేవి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ, శివుడు తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు శివయ్యలో ప్రేమను పుట్టించేందుకు కామదేవుడైన మన్మథుడు మన్మథ బాణం వదులుతాడు దీంతో కోపోద్రిక్తుడైనా శివుడు మూడో కన్న తెరచి కామదేవుడిని భస్మం చేస్తాడు. బూడిదగా మారిన తన భర్తను చూసి రతిదేవి వైధవ్యాన్ని మోయాల్సి వస్తుంది.ఆ తర్వాత శివుడికి పార్వతి మొత్తం విషయాన్ని చెప్పింది కానీ, ఇప్పటి వరకు ఆపవాదం కామదేవుడు మోస్తూనే ఉన్నాడు.
ఇదీ చదవండి: హోలీ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అద్భుతమైన విషయాలు..!
ఇదిలా ఉండగా హోలీ రోజే మొదటి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. మార్చి 25న ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల చంద్రగ్రహణం ఉంటుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి