Jyeshta Masam 2023: హిందూ సాంప్రదాయంలో జేష్ఠ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది వేసవికాలం మధ్యలో వస్తుంది. ఈ క్రమంలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. జ్యేష్ట మాసంలోని శుక్లపక్షం జూన్ 4 వరకు ఉంటుంది. అయితే ఈ క్రమంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఇలా దానం చేయడం వల్ల లాభాలు కలగడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని వారంటున్నారు. ఏ ఏయే వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని దానం చేయండి:


  • జ్యేష్ఠ మాసంలో తీవ్రమైన వడగాలులు వీస్తాయి. కాబట్టి కష్టపడి పనిచేసే వారికి చల్లని నీటిని గాని.. నిమ్మకాయతో తయారుచేసిన షర్బత్ ను కానీ దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

  • ఈ మాసంలో జంతువులకు, పక్షులకు నీటిని ఆహారాన్ని అందించడం చాలా శుభ ప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..


  • జ్యేష్ఠ మాసంలో చల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పేదలకు దోసకాయలు కానీ ఇతర ఆహార పదార్థాలను దానం చేయడం చాలా మంచిది. 

  • జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో 15 రోజుల పాటు పక్షులకు, జంతువులకు నీరు అందించడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజకులవుతారు. 

  • ఈ మాసంలో మొక్కలు ఎండిపోకుండా నీరు పెట్టడం కూడా చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయి.

  • జ్యేష్ఠ మాసంలోని ప్రతి మంగళవారం రోజున బెల్లం, గొడుగు, చెప్పులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook