Dream Science: మనం రోజూ నిద్రలో ఎన్నో కలలు కంటాం. ఇందులో కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉంటాయి. మనకు వచ్చే కలలను బట్టి ఫ్యూచర్ తెలుసుకోవచ్చని స్వప్నశాస్త్రం (Swapna Shastra) చెబుతోంది. కలల శాస్త్రం ప్రకారం, మీరు కలలో ఈ జీవులను చూస్తే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అంతేకాకుండా మీరు త్వరలోనే అదృష్టవంతులు అవుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో తెల్లటి సింహం కనిపిస్తే..
తెల్ల సింహం ప్రగతికి చిహ్నం. అంటే కలలో తెల్ల సింహం కనిపిస్తే.. మీరు కెరీర్‌లో చాలా పురోగతిని సాధిస్తారని అర్థం. అంతేకాకుండా మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. 
కలలో తెల్లటి ఏనుగు కనిపిస్తే..
కలలో తెల్ల ఏనుగును చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు.  తెల్ల ఏనుగును దేవేంద్రుడి వాహనంగా భావిస్తారు. తెల్ల ఏనుగు కలలో కనిపిస్తే మీ జీవితంలో పెను మార్పులు  చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. 


కలలో తెల్లటి పాము కనిపిస్తే..
మీకు కలలో తెల్లటి పాము కనిపిస్తే... మీ అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుంది. అంతేకాకుండా మహాశివుడు ఆశీర్వాదంతో మీరు దుఃఖం మరియు బాధ నుండి బయటపడతారు.
కలలో తెల్లటి నెమలి కనిపిస్తే..
ఒక వ్యక్తి తన కలలో తెల్లటి నెమలిని చూసినట్లయితే.. ఇది శుభసూచకంగా భావిస్తారు. ఆ వ్యక్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి.


Also Read: Tirgrahi Yog: వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం.. వీరికి మంచి రోజులు ప్రారంభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి