Dreams Interpretation: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో స్వప్నశాస్త్రం కూడా ఓ భాగం. కలలో కన్పించే అంశాలు భవిష్యత్తుకు సంకేతమంటారు. కలలో కొన్ని వస్తువులు కన్పిస్తే మీ అదృష్టం వికసిస్తుందని మీ ఇంట లక్ష్మీదేవి వస్తుందని అంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలు మనిషి జీవితంలో ఓ అంతర్భాగమని చెబుతుంది స్వప్నశాస్త్రం. ప్రతి వ్యక్తికి కలలు వస్తుంటాయి. కొన్ని యాధృచ్ఛికమైతే కొన్నింటికి బలమైన కారణాలుంటాయంటారు. కొన్ని అందమైన కలలుంటే మరి కొన్ని భయం గొలుపుతుంటాయి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలనేవి భవిష్యత్తుకు సంకేతాలు. భవిష్యత్తులో జరగనున్నదానికి సంకేతం కావచ్చు. కలలో కొన్ని వస్తువులు కన్పించడం శుభ సంకేతంగా భావిస్తారు. అంటే కొన్ని వస్తువులు చూడటం వల్ల అదృష్టం వికసిస్తుందంటారు. ఇంటికి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. కలలో ఎలాంటివి కన్పిస్తే శుభ సంకేతమో పరిశీలిద్దాం..


నిద్రించేటప్పుడు కలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే అది శుభ సంకేతంగా భావించాలి. మీ ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా మారుతుందని అర్ధం. వ్యాపారంలో ఊహించని లాభాలు ఎదురుకావచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో ఆవు కన్పించడం మరింత అదృష్ట సూచకం. ఆవు తల్లితో సమానమంటారు. అందుకే కలలో ఆవు కన్పించిందంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్ధం. జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి అంతులేని ధనలాభం కలుగుతుందని అర్ధం.


స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి కలలో ప్రవహించే శుభ్రమైన నీరు కన్పిస్తే అత్యంత లాభదాయకమని అర్ధం. పరిశుభ్రమైన నీరు కన్పించడం జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని అర్ధం. అంటే ఉద్యోగస్థులకు పదోన్నతి లభించవచ్చు. ఇతరులు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. కలలో డబ్బులు కన్పించడం కూడా శుభ సంకేతమే. డబ్బులు కలలో కన్పించాయంటే మీ అప్పులు తీరిపోనున్నాయని అర్ధం. ఆర్ధిక సమస్యలు దూరమౌతాయని సంకేతం.


Also read: Vastu Tips: ఉదయం లేవగానే ఈ 5 పనులు చేయవద్దు, లేకపోతే ఇంట్లో అంతా దారిద్య్రమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook