COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bhadra Rajyoga 2023: బుధ గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచార క్రమంలో బుధుడు దాదాపు నెల రోజుల పాటు సంచారం చేసే రాశిలోనే ఉండబోతున్నాడు. అయితే బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ క్రమంలో భద్ర రాజయోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్‌య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొంతమంది భౌతికంగా సుఖాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో, ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
కన్యారాశి:

కన్యారాశి ఈ బధుడి సంచారం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలలో మార్పులు వచ్చి మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా చాలా రకాల లాభాలు పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు కుటుంబ సభ్యులతో కలసి  విహారయాత్రకు వెళ్లడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో యాత్రలకు వెళ్లడం వల్ల సంతోష జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికొస్తే..ఈ బుధుడి సంచార క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే ఛాన్స్‌ కూడా ఉంది.  


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?


ధనుస్సు రాశి:
భద్ర రాజయోగం ధనస్సు రాశివారి కష్టాలను గట్టెక్కుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకముందు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్స్‌తో పాటు ప్రమోషన్స్‌ పొందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగాల కోసం చూస్తున్నవారు కూడా మంచి కంపెనీలో జాబ్‌ పొందుతారు.


మకర రాశి: 
మకర రాశివారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఈ రాశివారిపై కూడా భద్ర రాజయోగం ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఉద్యోగ జీవితంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో కోర్టు కేసుల్లో విజయాల కోసం ఎదురుచుస్తున్నవారికి ఈ క్రమంలో గుడ్‌ న్యూస్‌ వింటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుందిన. ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook