COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bhadra Rajyoga 2023: గ్రహాలు రాశి స్థానచలనం చేయడం కారణంగా కొన్ని సమయాల్లో శుభ యోగాలు ఏర్పడితే..మరి కొన్ని సమయాల్లో అశుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే అక్టోబర్‌ నెలలో శుభ ఘట్టం ఏర్పడబోతోంది. ఈ అక్టోబర్‌ నెల మొదటి వారం కొన్ని రాశుల లగ్న గృహంలో బుధుడు సంచారం చేయబోతుంది. దీంతో భద్ర రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై భద్ర రాజయోగం ప్రభావం:
కన్యారాశి:

కన్యారాశి వారికి లగ్న గృహంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమే కాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. వివాహితులు మంచి సంబంధాలను ఆశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అవివాహితులు వివాహ ప్రతిపాదనలను పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలతో పాటు మంచి పేరు సంపాదించుకుంటారు. అంతేకాకుండా కొత్త మార్గాల్లో కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కూడా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ రాజయోగం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యోగం కారణంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. సహోద్యోగుల సహాకారంతో మంచి పేరు సంపాదించుకునే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనంద జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఊహించని లాభాలు పొందుతారు. 


మకరరాశి:
మకర రాశి వారి జాతకంలో కూడా భద్ర రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడి సంచారంతో కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ రాజయోగం కారణంగా భౌతిక సుఖాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook