COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Gochar 2024 In Telugu: ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంది. గ్రహ కదలికలకు, సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలయిక వల్ల అప్పుడప్పుడు ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అయితే ఈ యోగాలు ఏర్పడం వల్ల కొన్ని సందర్భాల్లో 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే వృషభ రాశికి అధిపతిగా వ్యవహరించే బుధుడు సంచారం చేయబోతున్నాడు. 


చతుర్గ్రాహి యోగం:
బృహస్పతి మే 1న వృషంలోకి సంచారం చేశాడు. మే 14 వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. అలాగే గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు మే 14న అదే రాశిలోకి సంచారం చేశాడు. జూన్‌ 14వ తేది వరకు సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే మే 19న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో ఈ అన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


మేషరాశి:
చతుర్గ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతాయి. 


వృషభ రాశి:
ఒకే రాశిలో సూర్యుడు, గురు, బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే చతుర్గ్రాహి యోగం కారణంగా వృషభ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా కూడా సులభంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కర్కాటక రాశి:
ఈ చతుర్గ్రాహి యోగం కారణంగా కర్కాకట రాశివారి జీవితం పూర్తిగా మారుతుంది. అంతేకాకుండా వీరు శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి కంపెనీల నుంచి ఆఫర్స్‌ పొందే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంతో కలిసి యాత్రలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనేక లాభాలు పొందబోతున్నారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి