GajKesari Yoga: చంద్రగ్రహణం సమయంలోనే గజకేసరి రాజయోగం..ఈ 3 రాశుల వారికి ఏం జరుగుతుందంటే..

GajKesari Yoga: ఓకే రాశిలో రెండు గ్రహాల కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
GajKesari Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తిగత జీవితాల్లో మార్పులు రావడానికి గ్రహసంచారాలు కారణమే కాకుండా.. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో చేరడం వల్ల ఏర్పడే శుభయోగాల కారణంగా కూడా వస్తాయి. ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు ఒకే రాశిలో కలువబోతున్నాయి. అక్టోబర్ 28న వచ్చిన పౌర్ణమి కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. అయితే ఇదే సమయంలో ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం కూడా సంభవించబోతోంది. ఇదే సమయంలో చంద్రుడు, బృహస్పతి కలవబోతున్నాయి.
దీని కారణంగానే గజకేసరి రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాజయోగం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఈ యోగం కారణంగా జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని.. దీంతోపాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
గజకేసరి రాజయోగం వల్ల మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు మంచి అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వీరు జీవిత భాగస్వామితో కలిసి సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అదృష్టం పెరగడం కారణంగా ఆర్థిక లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో ఊహించని ఫలితాలు పొందుతారు. పెళ్లి కాని వారికి ఈ సమయంలో ప్రపోజల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీపై మీకు విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.
మిథునరాశి:
బృహస్పతి-చంద్రుడి కలయిక కారణంగా ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసే వారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వాముల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. రాజయోగం కారణంగా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి అదృష్టం పెరిగి అన్ని పనులు సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ గజకేసరి యోగం కారణంగా కొత్త ఉద్యోగాలు పొందుతారు. అంతేకాకుండా జీవితం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.