Jupiter and Mars Conjunction In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవగురు బృహస్పతి, అంగార గ్రహాలను శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుంటారు.  అంగారకుడిని ధైర్యం, శక్తి, డబ్బుకు సూచికగా పరిగణిస్తారు. ఇక బృహస్పతి గ్రహాన్ని ఆనందం, సంపదతో పాటు ఐశ్వర్యానికి కూడా సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత అంగారకుడు జూలై 12న రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం వృషభ రాశిలో జరగబోతోంది. అలాగే ఇదే సమయంలో బృహస్పతి గ్రహం కూడా సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బృహస్పతి ఏ రాశిలోనైనా కొన్ని రోజుల పాటు సంచారం దశలో ఉంటుంది. దీంతో ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా ఇంట్లో ధనం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా డబ్బులు పొదుపు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉన్నట్టుంది ఆర్థిక పురోగతి కూడా లభిస్తుంది. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కుజుడుతో పాటు గురు గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరు సానుకూల శక్తిని కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సంయోగం కారణంగా ఆదాయం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే ఉద్యోగస్తులు చేసేవారికి ప్రమోషన్స్ రావడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా వస్తాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి సపోర్ట్‌తో ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు నెర్చుకునే ఛాన్స్‌ కూడా ఉంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


సింహ రాశి:
సింహ రాశివారు కూడా ఈ సమయంలో విపరీమతైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా  కెరీర్‌తో పాటు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో బోలెడు ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారి ప్రమోషన్స్‌ కూడా కలుగుతాయి. అంతేకాకుండా తండ్రి నుంచి సపోర్ట్‌ లభించి ఎలాంటి పనులైనా సుభంగా చేయగలుగతారు. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి