COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jupiter Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బృహస్పతి గ్రహం త్వరలోనే తిరుగమనం చేయబోతోంది. జ్ఞానం, పిల్లలు, విద్య, సంపద, పుణ్యానికి సూచికగా పరిగణించే ఈ గ్రహం సంచారం చేయడంతో అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 4న మేషరాశిలోకి బృహస్పతి గ్రహం తీరోగమనం చేయబోతోంది. అయితే ఈ గ్రహం సంచారం జాతకాలలో అనుకూల స్థానంలో ఉంటే అపార ప్రయోజనాలు కలుగుతాయని ప్రతికూల స్థానంలో ఉన్న వారికి నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ గ్రహం తీరుగమనం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గృహస్పతి తిరోగమన ప్రభావం ఏయే రాశి వారిపై ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


మేష రాశి:
మేష రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ఓపికగా ఉండటం వల్ల నష్టాలు కలగకుండా ఉంటాయి. దీంతోపాటు వీరు ఈ సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మేలు.. ఇక బృహస్పతి తిరోగమన కారణంగా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయం అనేక రకాల ప్రయోజనాలను కలిగించబోతోంది. ఉద్యోగాల్లో మార్పుల కారణంగా వీరికి ప్రమోషన్స్ తో పాటు జీతాలు పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. దీంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి భవిష్యత్తులో లావదాయకంగా ఉండవచ్చు.  విద్యను అభ్యసిస్తున్న వారు పోటీ పరీక్షల్లో తిరుగులేని విజయాలు పొందుతారు.


మిథునరాశి:
బృహస్పతి తిరుగమనం కారణంగా మిథునరాశి వారికి మనసు ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. ఇక స్నేహితుల మద్దతు లభించి తిరుగులేని విజయాలను సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి చదువులపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారం పరంగా అన్ని అనుకూలంగానే ఉంటాయి.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి