Jupiter Transit 2024: గురుగ్రహం ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒక సారి సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయ. వ్యక్తుల జాతకాలను గురుగ్రహం శుభస్థానంలో ఉంటే చాలా అదృష్టంగా పరిగణిస్తారు. ఇలా ఉండడం వల్ల జీవితంలో డబ్బుకు శ్రేయస్సు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్మకం. అయితే 2024 సంవత్సరంలో బృహస్పతి గ్రహం ఇంతకుముందు ఎప్పుడు సంచారం చేయని రాశి..వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం మే 1వ తేదీన జరగబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశిలో వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం:
సింహ రాశి:

సింహ రాశి వారికి బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేయడం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు విదేశీ ఒప్పందాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇంతకుముందు గొడవలు ఉంటాయి. ఈ సమయంలో సులభంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గృహస్పతి సంచారం కారణంగా విముక్తి లభిస్తుంది. దీంతోపాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


కన్యా రాశి:
కన్యా రాశి వారికి గృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ ఈ సంచారం కారణంగా పూర్తవుతాయి. అలాగే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సంచారం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకే సంచారం చేయడం కారణంగా వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. దీంతోపాటు ఆదాయం పెరిగి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కొత్త కొత్త పనులు లభించి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter