Mars Transit: కుజుడి సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో కీలక మలుపులు..
Mars Transit in Capricorn 2024: ఫిబ్రవరి 5వ తేదీన మకర రాశిలోకి కుజ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా మకర రాశి తో పాటు మరికొన్ని రాశుల వారు అనేక రకాల ప్రయోజనాలు పొందబోతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి.
Mars Transit in Capricorn 2024: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహానికి ప్రత్యేక పేరుంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా చెప్పుకుంటారు. ధైర్య సాహసాలు, శక్తి, బలానికి సూచికగా భావించే కుజ గ్రహం మేష, వృశ్చిక రాశికి అధిపతిగా పిలుస్తారు. అయితే ఈ గ్రహం ఫిబ్రవరి 5వ తేదీన మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి కుజుడి సంచారం కారణంగా అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది.
వృషభ రాశి:
ఫిబ్రవరి 5వ తేదీన జరిగే కుజుడి సంచార ప్రభావం వృషభ రాశి వారిపై బలంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా పూర్వీకుల నుంచి పొందాల్సిన ఆస్తులు కూడా ఈ సమయంలో పొందుతారు. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఈ సమయంలో కష్టపడి చదవడం వల్ల గొప్ప విజయాలు సాధిస్తారు. దీంతోపాటు వీరికి వాహన సౌఖ్యం కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ సమయంలో అనేక మార్పులు వస్తాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహరాశి:
సింహ రాశి వారికి కుజుడి సంచారం ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల ఎలాంటి సులభంగా సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం ఎంతో కీలకమైనది. కొత్త ఆదాయం లభించి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. పరిశోధనలు చేసేవారు ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వారికి తొందరలోనే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
మకర రాశి:
మకర రాశి వారికి కుజుడి సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు వ్యాపార పరిస్థితిని కూడా మెరుగుపడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగుపడతారు..ఇక మీ పిల్లలనుంచి కూడా గొప్ప శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter