Mars Transit In Virgo 2023: గ్రహాల కదలికల కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆగస్టు 18న కుజుడు తన రాశి వదిలి కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ అంగారకుడిని శక్తి, సోదరుడు, భూమి, ధైర్యం, శౌర్యం కారకంగా భావిస్తారు. కుజుడు మేషం, వృశ్చికరాశికి చెందినవాడు. కన్యారాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా భారీ  లాభాలు పొందుతారు. అయితే ఈ అంగారుకుడి ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై అంగారకుడి ప్రభావం:
మేష రాశి:

అంగారకుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో మనసుకు ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఓపికగా ఉండడం వల్ల అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే వీరు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరికి ఖర్చులు రెట్టింపు అవుతాయి.


వృషభ రాశి:
అంగారకుడి సంచార ప్రభావం వృషభ రాశివారిపై కూడా పడుతుంది. ఈ క్రమంలో వీరికి మనస్సు చంచలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వీరిపై వీరికి విశ్వాసం తగ్గవచ్చు. మానసిక ప్రశాంతత లోపించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


కర్కాటక రాశి:
కర్కాటక రాశి ఈ సంచారం కారణంగా నసులో ఆశ, నిస్పృహలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆగిపోయి పనులతో పాటు డబ్బు కూడా తిరిగి వస్తాయి. అంతేకాకుండా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంద.


కుంభ రాశి:
కుంభ రాశివారికి అంగారకుడి సంచారం కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలో ఆనందం పెరగడమే కాకుండా సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో శ్రమ తగ్గి ఒత్తిడి కూడా తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


మీన రాశి:
మీన రాశి వారికి అంగారకుడి సంచారంతో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనసుకు ఆనందంగా ఉండడమే కాకుండా సంతోషంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉదోగ్యాలు చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. పని రంగంలో మార్పు కూడా వచ్చే ఛాన్స్‌ ఉన్నాయి. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి