COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sun Moon Mars Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి వాటి కాలవ్యవధిని బట్టి రాశి సంచారం చేస్తాయి. ఒక రాశి నుంచి మరో రాశికి గ్రహాలు సంచారం చేయడం శాస్త్రం ప్రకారం అతి ముఖ్యమైన ప్రక్రియగా చెప్పుకుంటారు. ముఖ్యంగా సూర్య గ్రహం సంచారం చేయడం జ్యోతిష్య శాస్త్రంలో అతి కీలకమైన ప్రక్రియ.. ఈ గ్రహం ఇప్పటికే వృశ్చిక రాశిలో సంచారం చేసింది. అయితే ఇదే రాశిలో కుజుడు కూడా సంచారం చేయబోతున్నాడు. అలాగే చంద్రుడు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేశాడు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు.


ఈ రాశుల వారిపై త్రిగ్రహి యోగం ప్రభావం:
వృశ్చిక రాశి:

సూర్య, కుజ, చంద్ర గ్రహాల కలయిక కారణంగా వృశ్చిక రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలతో పాటు ప్రశంశాలు లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పెద్దపెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు ఇక ఆరోగ్య విషయానికొస్తే.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా మంచిది లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు వృచ్చిక రాశి వారికి సమాజంలో స్థాయి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.


మిథున రాశి:
మూడు గ్రహాలకు అనేక కారణంగా ఏర్పడే త్రిగ్రహి యోగం మిధున రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం చూపబోతోంది ఈ రాశి వారికి వచ్చే నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే చదువుపై దృష్టి పెరిగి పోటీ పరీక్షల్లో రాణిస్తారు. దేవిరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది లేకపోతే అనారోగ్య సమస్యలు రావచ్చు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


కన్యా రాశి:
త్రిగ్రహి యోగం కారణంగా కన్యా రాశి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో సానుకూల శక్తిని పొంది వృత్తి జీవితంలో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి, జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే.. కష్టపడి చదవడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి