Sun Transit in Cancer 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలకు రాజులు, రాకుమారులు ఉంటారు. సూర్య గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అయితే ఈ గ్రహం ఏ రాశిలోనే 30 రోజు ఉంటుంది. ఆ తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. మరికొద్ది రోజుల్లో సూర్యుడు కొత్త రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కారణంగా శుభ, అశుభ ప్రభావాలు పడుతాయని జ్యోతిష్యులు తెలుపుతన్నారు. అయితే ఈ గ్రహం జూలై 16న కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇది ఆగస్టు 15 వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు 15 వరకు మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి:
సింహ రాశివారికి సూర్యుడి సంచారం కారణంగా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో పాటు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గొప్ప నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు తల్లిదండ్రులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే వ్యాపారాల్లో కూడా అనేక మార్పులు వచ్చి అనుకున్న పనులు చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక దీర్ఘకాలిక వ్యాధులు హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ సమయంలో విద్యార్థులు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే వీరికి చదువుపై కూడా ఏకాగ్రత పెరిగే ఛాన్స్‌ ఉంది. ఈ సింహ రాశివారికి ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గింపోతుంది. 


వృశ్చికరాశి:
కర్కాటక రాశివారికి కూడా సూర్యుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచార సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మీనరాశి:
మీన రాశివారికి కూడా ఈ సంచారం ఎంతో లాభాదయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు వ్యాపారాల్లో లాభాలు పొందడమే కాకుండా ఆర్థికంగా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. ఇక విద్యార్థులైతే ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపులున్నారు. దీంతో పాటు ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలు‌ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి