Devguru Brihaspati in Bharani Nakshatra: బృహస్పతి గ్రహ సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహం కేవలం ప్రత్యేక సమయాల్లో మాత్రమే సంచారం చేస్తుంది. ఈ సంచారంతో అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఏప్రిల్‌లో బృహస్పతి మేషరాశిలో సంచరించాడు..జూన్ 21న మధ్యాహ్నం 1:19 గంటలకు భరణి నక్షత్రంలో ప్రవేశించారు. నవంబర్‌ 27 వరకు బృహస్పతి గ్రహం అదే నక్షత్రంలో ఉండబోతోంది. ఆ తర్వాత బృహస్పతి అశ్వినీ నక్షత్రంలో సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై బృహస్పతి గ్రహ ప్రత్యేక ప్రభావం:
తుల రాశి:

తుల రాశి వారికి భరణి నక్షత్రంలో దేవగురువు బృహస్పతి సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృత్తి పరంగా పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు..పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా భారీ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


ధనుస్సు రాశి:


భరణి నక్షత్రంలోకి బృహస్పతి సంచారంతో ధనుస్సు రాశివారి జీవితంలో ఒక్కసారిగా మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ వింటారు. వీరికి ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరగవచ్చు. ఇక వ్యాపారాలు చేసేవారు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


మేష రాశి:
బృహస్పతి సంచారంతో మేషరాశి జీవితంలో కూడా అనేక మార్పులు రావచ్చు. భవిష్యత్‌ కోసం కష్టపడి పని చేసేవారు ఈ క్రమంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది సరైన సమయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి