Venus Transit: డిసెంబర్ నెలలో మళ్లీ శుక్ర గ్రహం రాశి సంచారం చేయబోతోంది జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, సంపద, ఐశ్వర్యం, వివాహం, ఆనందం కారకంగా భావించే శుక్రుడు అతి త్వరలోనే ఒక రాశి నుంచి మరో రాశి మారబోతున్నాడు. దీని కారణంగా ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కొన్ని రాశులకు లభించబోతోంది. నవంబర్ 30వ తేదీన శుక్రుడు తులా రాశిలో సంచారం చేశాడు. డిసెంబర్ 25న శుక్ర గ్రహం తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపవడమే కాకుండా శుభవార్తలు కూడా అంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం:
మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుని సంచారం లాభదాయకంగా ఉండబోతోంది. వీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల దినదిన అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు కష్టపడి పనులు చేయడం కారణంగా మంచి లాభాలు పొందుతారు ఇక కుటుంబ జీవిత విషయానికి వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే జీవిత భాగస్వామితో మాత్రం ప్రేమతో ఉండాలని చాలా మంచిది..లేకపోతే అనేక విభేదాలు తలెత్తే ఛాన్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఓపికతో సమస్యలను పరిష్కరించుకోండి.


వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్రుడు సంచారం కారణంగా నవంబర్ నెలతో పాటు డిసెంబర్ నెల కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్న వారికి అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ప్రేమ సందేశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా డిసెంబర్లో జరిగే శుక్రుడు సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి జీవితం శృంగార భరితంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని మంచి ఫలితాలు పొందుతారు. ఈ కర్కాటక రాశి వారు వాహనాలు కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడి ఆర్థికంగా లాభపడతారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి