Venus-Rahu Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన బృహస్పతి శుక్ర గ్రహాలు ఈరోజు మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఇప్పటికే మీనరాశిలో రాహు సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా మూడు గ్రహాలు ఒకే చోట సంయోగం చెందబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్ర రాహు గ్రహాలు కలయిక కారణంగా ఎంతో ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది. దీని  కారణంగా రాజయోగాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాహు, శుక్రుడి కలయిక కారణంగా జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభప్రదంగా ఉంటే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి అదే ప్రతికూల స్థానంలో ఉన్నవారికి విపరీతమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ గ్రహాల కలయిక కారణంగా రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం:             
కర్కాటక రాశి వారికి శుక్ర, రాహువుల కలయిక ఎంతో శుభప్రదంగా మారబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతోపాటు సంతోషకరమైన శాంతి వాతావరణం నెలకొంటుంది. అలాగే ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగార భరితంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి విపరీతమైన ఆదాయం కూడా పెరగవచ్చు. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి పెద్ద పెద్ద సంస్థల్లో ఆఫర్స్ లభిస్తాయి. ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.


వృషభం:         
వృషభ రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ  రాశి వారికి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు దాంపత్య జీవితం గడుపుతున్న వారికి శృంగార భరితంగా ఉంటుంది. అలాగే వీరు ఈ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన పనుల్లో కూడా మంచి పురోగతి సాధిస్తారు. ఇంతకుముందు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
          
మిథునం:           
శుక్రుడు, రాహువు కలయిక మిథునరాశి వారికి కూడా అనేక రకాల ప్రయోజనాలను తెచ్చిపెట్టబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ప్రమోషన్స్ లభించడమే, కాకుండా కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు అలాగే స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. ఇక దాంపత్య జీవితంలో కూడా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే పూజల పట్ల ఆసక్తి పెరుగుతుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి