Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే ఎక్కువ ప్రాముఖ్యత శుక్ర గ్రహానికి ఉంటుంది. ఈ గ్రహాన్ని వివాహం, ప్రేమ, కీర్తికి సూచికగా భావిస్తారు. ఈ శుక్ర గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే జీవితంలో సంతోషం సంపదలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అతి త్వరలోనే శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. అంటే శుక్ర గ్రహం త్వరలోనే సంచారం చేయబోతోంది. ఈ గమనం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై సమానంగా పడుతుంది. అయితే ఈ గ్రహం నవంబర్ 30వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు కన్య రాశి నుంచి తులా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఆర్థికంగా మంచి లాభాలు పొందితే మరికొన్ని రాశుల వారు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఎప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి:
శుక్రుడు సంచారం తులారాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులా రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి.. శుక్రుడు తన సొంత రాశిలోకి సంచారం చేయడం కారణంగా తులా రాశి వారి అదృష్టం లెక్కింపు అవుతుంది. దీని కారణంగా ప్రేమ జీవితంలో శృంగారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సంచారం కారణంగా ఉపశమనం లభిస్తుంది.


కర్కాటక రాశి:
శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని డబ్బు పొందడమే..కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఇక పిల్లలు ఉన్నవారు ఈ సమయంలో వారి నుంచి ఊహించని శుభవార్తలు వింటారు.


మిథున రాశి:
శుక్ర గ్రహ సంచారం మిథున రాశి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉండబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సంచారం ప్రభావం మంచి ఫలితాలను అందించబోతోంది. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా పొందుతారు. దీంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


వృశ్చిక రాశి:
శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం వృశ్చిక రాశి వారిపై కూడా పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితంలో శృంగారం రెట్టింపు అవుతుంది దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. 


మేషరాశి:
శుక్రుడి సంచారం మేష రాశి వారికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook