Dussehra 2022: దసరా రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది, ఇక మీకు డబ్బే డబ్బు..!
Dussehra 2022: రేపే విజయదశమి లేదా దసరా. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ కింది చర్యలు తీసుకోండి.
Dussehra 2022 Remedies: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. రేపు అంటే బుధవారం అక్టోబరు 5 నాడు విజయదశమి లేదా దసరా (Dussehra 2022). ఈ రోజునే లంకాధిపతి రావణుడిని రాముడు సంహరించాడు. ఇవాళ దేశంలోని చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. మంగళవారం దుర్గాదేవి అవతారమైన మహిషాసుర మర్దినీ పూజిస్తారు. అయితే ఈ దసరా టైంలో మీరు చేసే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీంతో ఆ వ్యక్తి కెరీర్ లో పురోగతి సాధించడంతోపాటు అపారమైన డబ్బును పొందుతారు.
ఇలా చేయండి...
>> దసరా రోజు సాయంత్రం ఏదైనా ఆలయంలో లక్ష్మీదేవిని ధ్యానిస్తూ చీపురు దానం చేయడం వల్ల అపారమైన సంపదను పొందవచ్చు.
>> న్యాయపరమైన విషయాల్లో విజయం కోసం దసరా రోజున శమీ చెట్టు కింద నూనె దీపం వెలిగించడంతోపాటు సుందరకాండను కూడా పఠించండి.
>> ఉద్యోగ, వ్యాపారాలలో వచ్చే అడ్డంకులు తొలగిపోవడానికి దసరా రోజున 'ఓం విజయాయై నమః' అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత దుర్గాదేవిని పూజించండి. పూజలో అమ్మవారికి 10 పండ్లను నైవేద్యంగా పెట్టండి. తరువాత పేదలకు ఈ పండ్లను పంచండి. దీంతో మీ ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి.
>> దసరా రోజున నీలకంఠ పక్షిని చూడండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. అంతేకాకుండా శత్రువులపై విజయం సాధిస్తారు.
>> విజయదశమి రోజున కొబ్బరికాయను పసుపు గుడ్డలో చుట్టి.. ఆపై ఈ కొబ్బరికాయను ఒక జత జానేవు మరియు స్వీట్లను ఆలయానికి దానం చేయండి. ఇది వ్యాపారంలో నష్టాలను అరికట్టి లాభాలను పెంచుతుంది.
Also Read: Indrakiladri: మహిషాసుర మర్ధినీగా అమ్మవారు.. దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి