Dussehra 2022 Wish, Quotes, Whatsapp Facebook Status, SMS in Telugu: నవరాత్రుల్లో ఈ రోజూ చివరి రోజు.. కాబట్టి భక్తులంతా అమ్మ అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతాను పూజిస్తారు. ఇక దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు కూడా మొదలవుతాయి. దసరా రోజున దుర్గాదేవి భక్తులంతా మహిషాసుర మర్దన కార్యక్రమంలో పాల్గొని విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా కొంద మంది కొత్త దుస్తువులను ధరించి మహా శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పూర్వీకుల విషయానికొస్తే.. వారు దసరాను ఎంతో భక్తితో జరుపుకునేవారట..అమ్మవారి తొమ్మది రోజుల పాటు ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో కొలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. ఇక విజయదశమి వేడుకల విషయానికొస్తే..పూర్వీకులు ఉదయం వేకువ జామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి జల్లి..గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టేవారు. ఉయదం 6 గంటల పాంత్రంలో స్నానాలు ముంగించుకుని కొత్త దుస్తువులు ధరించి అమ్మవారికి పూజలు చేసేవారు. ఆ తర్వాత పిండి వంటలు చేసుకుని భోజం చేసేవారని పురాణాలు పేర్కొన్నాయి. ప్రస్తుం దసరా దీనికి భిన్నంగా జరుగుతోంది.  అయినప్పటికీ ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అయితే ఇదే సంతోషాల నడుమ మీ స్నేహితులకు ఇలా విజయదశమి శుభాకాంక్షలు(Dussehra 2022 Wish) తెలియజేయండి.


మీ స్నేహితుల కోసం దసరా శుభాకాంక్షలు కోట్స్‌:


<<ఓం సర్వమంగళ మాంగల్యే శివే శర్వార్ధ సాధకే శరణ్యేత్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే!!..
"విజయ దశమి శుభాకాంక్షలు"


<<చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. 
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు..


<<ఈ విజయ దశమి నుంచి మీకు అన్ని విజయాలే కలగాలని.. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని.. 
కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు..
"దసరా శుభాకాంక్షలు"


<<యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమో నమ:
దేవి ఆసీస్సులతో మీరందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..
"విజయ దశమి శుభాకాంక్షలు"


<<అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..
లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ..
మహిషాసురులని మర్ధించే మహంకాళి అమ్మలగన్న యమ్మ మేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ..
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని, మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ..
"దసరా శుభాకాంక్షలు"


 


Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.


Also Read: Dussehra 2022 Date: దసరా రోజూ చేయాల్సి కార్యక్రమాలు ఇవే.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి