Dussehra 2022: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా లేదా విజయ దశమిని జరుపుకుంటారు. అశ్వినీ మాసం శుక్లపక్షం పదో రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈసారి దసరా (Dussehra 2022) అక్టోబర్ 5వ తేదీన వచ్చింది. ఈ రోజునే శ్రీరాముడు లంకాపతి రావణుడిని, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించారు. ప్రతి సంవత్సరం దసరా నాడు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అంతేకాకుండా ఈ రోజు దుర్గామత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దీంతో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం 2022
హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 04, 2022 మధ్యాహ్నం 02:20 నుండి ప్రారంభమై.. 05 అక్టోబర్ 2022 మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది.
విజయదశమి ముహూర్తం - అక్టోబర్ 5, 2022, మధ్యాహ్నాం 02:13 - మధ్యాహ్నం 02:54 
వ్యవధి - 47 నిమిషాలు
మధ్యాహ్నం పూజ సమయం - అక్టోబర్ 5, 2022, మధ్యాహ్నం 01:26 - మధ్యాహ్నం 03:48 
వ్యవధి - 2 గంటల 22 నిమిషాలు
శ్రవణ నక్షత్రం ప్రారంభం - 04 అక్టోబర్ 2022, రాత్రి 10.51 నుండి
శ్రవణ నక్షత్రం ముగింపు - 05 అక్టోబర్ 2022, రాత్రి 09:15 వరకు


విజయదశమి పూజా విధానం
>> దసరా రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తర్వాత శ్రీరాముడు, మాతా సీత మరియు హనుమంతుడిని పూజించండి.
>> విజయదశమి నాడు ఆవు పేడతో 10 బంతులను తయారు చేసి దాని పైన బార్లీ గింజలు వేస్తారు.
>> ఈ బంతులు అహంకారం, దురాశ, కోపం మొదలైన వాటికి చిహ్నంగా భావిస్తారు. రాముడిని పూజించిన తర్వాత వీటిని కాల్చుతారు. ఈ విధంగా పూజించడం ద్వారా, వ్యక్తి తన మనస్సుతో ఈ అరిష్టాలను కాల్చివేసి విజయం సాధిస్తాడని నమ్ముతారు.


Also Read: Navaratrulu 2022: నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook