Navaratrulu 2022: దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం? దసరా ఏ రోజు వస్తుంది?

Navaratrulu 2022: హిందూమతంలో సంవత్సరానికి నాలుగు నవరాత్రి పండుగలు జరుపుకుంటారు. వాటిలో చైత్ర మరియు శారదీయ నవరాత్రులు ప్రత్యేకం. ఈ సారి శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 06:30 PM IST
Navaratrulu 2022: దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం? దసరా ఏ రోజు వస్తుంది?

Navaratrulu 2022:​ హిందూమతంలో నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది. నవరాత్రులు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రథమ రోజున ప్రారంభమై.... నవమి రోజుతో ముగుస్తాయి. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు పది రోజులలో తొమ్మిది రూపాలలో దుర్గాదేవిని (Goddess Durga) పూజిస్తారు. ఈ నవరాత్రులు సంవత్సరానికొకసారి వస్తాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబరు 26 తేదీన ప్రారంభమై.. అక్టోబర్ 5 విజయ దశమి రోజుతో ముగుస్తాయి. ఈ నవరాత్రులకే శరన్నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు. 

నవరాత్రుల తొమ్మిది రోజులలో తేదీ ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు. ఈసారి మహాష్టమి వ్రతం అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. ఈ రోజున మహాగౌరిని పూజిస్తారు. అక్టోబర్ 4 న నవమి వస్తుంది. ఈ రోజున మాత సిద్ధిదాత్రిని పూజిస్తారు. అక్టోబర్ 5 అంటే పదో రోజున దుర్గాదేవి నిమజ్జనంతో నవరాత్రులు ముగుస్తాయి.

మహానవమి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, దుర్గాదేవి రాక్షస రాజు మహిషాసురుడితో 9 రోజులు పోరాడింది. అందుకే ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రుల చివరి రోజున అంటే నవమి నాడు దుర్గాదేవి విజయం సాధించింది కాబట్టి దీనిని మహానవమి అని కూడా అంటారు.

ఒక్కో రోజు ఒక్కో రూపం: 
26 సెప్టెంబర్ (1వ రోజు) - దేవీ శైలపుత్రి ఆరాధన
27 సెప్టెంబర్ (2వ రోజు) - మాత బ్రహ్మచారిణి ఆరాధన
28 సెప్టెంబర్ (3వ రోజు) - తల్లి చంద్రఘంట ఆరాధన
29 సెప్టెంబర్ (4వ రోజు) - మాత కూష్మాండ ఆరాధన
30 సెప్టెంబర్ (5వ రోజు) - తల్లి స్కందమాత ఆరాధన
అక్టోబర్ 1 (ఆరవ రోజు) - కాత్యాయని మాత ఆరాధన
అక్టోబర్ 2 (ఏడవ రోజు) - మాత కాళరాత్రి ఆరాధన
అక్టోబర్ 3 (ఎనిమిదవ రోజు) - తల్లి మహాగౌరి ఆరాధన
అక్టోబర్ 4 (తొమ్మిదవ రోజు) - మాత సిద్ధిదాత్రి ఆరాధన
అక్టోబర్ 5 (పదో రోజు) - విజయదశమి లేదా దసరా

Also Read: Shani Vakri 2022: తిరోగమనంలో శనిదేవుడు.. ఈ 3 రాశులవారికి దశ తిరుగుడు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News