Astrology: రేపటి నుండి ఈ 4 రాశుల వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది.. మీ రాశి ఉందా?
Saturn Rise 2024: ఇటీవల న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో ఉదయించాడు. దీంతో నాలుగు రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Uday 2024 Positive Impact: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. కర్మఫలదాత అయిన శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తాడు. ఇప్పటి వరకు అస్తమయ స్థితిలో ఉన్న శని గ్రహం...రీసెంట్ గా అంటే మార్చి 17న కుంభరాశిలో ఉదయించాడు. శనిదేవుడి యెుక్క ఈ పెరుగుదల మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా నాలుగు రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. శనిదేవుడు యెుక్క స్థానం కారణంగా నాలుగు రాశులవారి జీవితాల్లో సంతోషం వెలుగులు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్య రాశి
శని అస్తమయం కారణంగా ఇబ్బంది పడిన కన్యారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు మీ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా కోర్టు చిక్కుల నుండి బయటపడతారు. అంతేకాకుండా మీ ఆదాయం వృద్ధి చెందుతుంది.
తులారాశి
శనిదేవుడు ఉదయం కారణంగా తులరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీరు కెరీర్ గురించి కన్న కలల నెరవేరుతాయి. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు అప్పులు ఊబి నుండి బయటపడతారు.
మేషరాశి
శనిదేవుడు పెరుగుదల కారణంగా మీరు కోరుకున్న లైఫ్ ను పొందుతారు. మీ కెరీర్‌కు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు పెద్ద స్థాయికి వెళతారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. మీ సంపద భారీగా పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
వృషభం
వృషభ రాశి వారికి శనిదేవుడు రైజింగ్ మంచి లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉండబోతుంది. ఆఫీసులో మీ బాస్, సహచరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. చదువు లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Surya Grahan 2024: 50 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook