Utpanna Ekadashi 2022: ప్రతి నెలలో ఏదో ఒక పేరుతో ఏకాదశిలు వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని అంటారు. అయితే ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజున మతాలు ఉద్భవించాయని హిందువులంతా నమ్ముతారు. అంతేకాకుండా విష్ణుమూర్తి తల్లి కూడా జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ మాసంలో ఉత్పన్న ఏకాదశి ఏ రోజున ప్రారంభమవుతుంది?:
ప్రతి సంవత్సరంలా ఉత్పన్న ఏకాదశి నవంబర్ 20వ తేదీన ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాల్లోని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు ఉపవాసాలు పాటించి మహావిష్ణువుని పూజిస్తే జీవితంలో ఆనందం, శాంతి జీవితాంతం ఉంటుంది.


 ఏకాదశి శుభముహూర్తాలు:
>>ఉత్పన్న ఏకాదశి నవంబర్ 19వ తేదీన ఉదయం ప్రారంభమై 20వ తేదీన ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.
>>ఏకాదశి వ్రత సమయాలు: ఉత్పన్న ఏకాదశి నవంబర్ 20వ తేదీన ముగుస్తుంది కాబట్టి.. వ్రతాలన్నీ నవంబర్ 21వ తేదీన ఉదయం 6: 48 నిమిషాల నుంచి 8 గంటల వరకు చేసుకోవచ్చు.


ఏకాదశి పూజా విధానం:
>>ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు పూజించడం పురాణాల నుంచి ఆనవాయితీగా వస్తుంది.
>>ఈరోజు మహావిష్ణు పూజ లో భాగంగా వెలిగించాల్సి ఉంటుంది.
>>ఈ వ్రతంలో భాగంగా పండ్లను మాత్రమే నైవేద్యంగా వెళతారు.
>>ఈ క్రమంలో పండ్లను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
>>పూజలో భాగంగా తల స్నానం చేసి గుడిలో దీపాలు వెలిగించాల్సి ఉంటుంది.
>>ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకి గంగాజలంతో అభిషేకం కూడా చేయాల్సి ఉంటుంది.
>>నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించవచ్చు.


Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే


Also Read : Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook