COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Elinati Shani Effect 2025 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఈ గ్రహం జాతకంలో రెండవ లేదా పన్నెండవ స్థానంలో సంచారం చేసినప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ఎంతో స్లోగా సంచారం చేస్తుంది. ఇది సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం సమయం పడుతుంది. అందుకే అన్ని రాశులు సంచారం చేయడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు సమయం పడుతూ ఉంటుంది. ఈ గ్రహం ఇప్పుడు కుంభ రాశిలో సంచార దశలో ఉంది. అయితే 2025 సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేయనుంది. ఈ రాశిలోకి శని గ్రహం ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఈ ఏలినాటి శని దశ నుంచి కూడా విముక్తి కలిగి అదృష్టం కలిసి వస్తుంది.


మేష రాశివారికి ఏలినాటి శని 2025 సంవత్సరం మార్చి 29 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదే రోజు శని గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా మేష రాశివారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఏలినాటి శని మూడు దశలు ఉంటుంది. కాబట్టి  ఈ దశలో సమయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు ప్రతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


మీన రాశిలోకి శని సంచారంతో లాభాలు పొందే రాశులు:
1. మకర రాశి:

మకర రాశిని శని పాలించే గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అయితే ఈ గ్రహం మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల మకర రాశివారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా వీరికి ఇప్పుడు శని చివరి దశలో కొనసాగుతోంది. కాబట్టి వీరికి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి వచ్చే సంవత్సరం మార్చి నెలల నుంచి ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు. అలాగే అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. 


2. కర్కాటక రాశి:
శని సంచారంతో కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి శని అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ వెంటనే జరిగిపోతాయి. అంతేకాకుండా కర్కాటక రాశివారికి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగాల్లో పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.