Ex Telangana CM KCR Horoscope: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) గురించి కొత్తగా పరిచయాలు అకర్లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడా రక్తం చిందకుండా రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో కాంగ్రస్, భారతీయ జనతా పార్టీలను ఒప్పించి పార్లమెంటులో తెలంగాణ బిల్ పాస్ అయ్యేలా చేసి కల అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన నాయకుడిగా తెలంగాణ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే వేళలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చడానికి ప్రయత్నం చేసింది. దీంతో రాజకీయ పునరేకికరణ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో కేసీఆర్ చేసిన తెలంగాణ ప్రజలు హర్షించారు. మరోవైపు మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలతో 2018లో రెండోసారి ఇక్కడ ప్రజలు అధికారం కట్టబెట్టారు.   కానీ 2023 ఎన్నికల్లో కేసీఆర్ తన పార్టీ పేరు మార్పు సహా చేసిన కొన్ని చారిత్రక  తప్పిదాల వల్ల అధికారం కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో  ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ప్రయోగించిన అస్త్రాన్నే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. కేసీఆర్ పై ప్రయోగిస్తున్నారు. ఆయన పార్టీలోని  ఎమ్మెల్యేలపై గురిపెట్టారు.


ఈ సంగతి పక్కన పెడితే.. ఈ క్రోధి సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది.  జ్యోతిష్కులు ఏం చెబుతున్నారంటే.. కేసీఆర్.. 17 ఫిబ్రవరి 1954లో జన్మించారు. ఈయన జన్మ నక్షత్రం ఆశ్లేష.. కర్కాటక రాశి.  క్రోధి నామ సంవత్సరంలో  1-5-2024 నుంచి ఈ రాశి వారికి  ధనము, బుద్ది, సంతానము, విద్యకు కారకుడైన గురుడు 11వ స్థానంలో ఉండటం వల్లనుంచి మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. కానీ అష్టమ శని కారణంగా అష్టకష్టాలు పడే అవకాశాలున్నాయి. మానసికంగా కృంగిపోతారు.


కేతువు 3వ స్థానంలో ఉండటం వలన  భక్తి కేసీఆర్‌ను కాపాడే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఈయన జాతకంలో గురు మహర్ధశలో ఉండటం వలన జాతక కుండలిలో బృహస్పతి కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఇది యోగ కారకుడు. ఇది 2035 సెప్టెంబర్ వరకు ఈ యోగం ఉంటుంది. ప్రస్తుతం గురువు, శని, రాహువు గ్రహాల స్థితిగతులు అంతగా బాగాలేదు. ఈ కారణంగా కొన్ని కష్టానష్టాలను ఫేస్ చేసే అవకాశాలున్నాయి.  1-5-2024 నుంచి ఈ రాశి వారికి  బాగుంటుంది. కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. 30/4/2024 వరకు జాతకంలో ఉన్న ఇబ్బందుల కారణంగా మానసిక అశాంతి, అనారోగ్య బాధలు వంటి చెడు ఫలితాలను అందించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  కోర్టు చిక్కులు, దగ్గర ఉన్న వారు దూరమవడం, పక్కనున్న వారే పతనాన్ని కోరుకోవడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. మానసిక లాభం చేకూరే లాభం అవకాశం కొంతలో కొంత ఉపశమనం.


Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook